సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందరికీ సుపరిచితుడే.ఇటీవలే “RRR” సినిమాకి గాను పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడం జరిగింది.
దీనిలో భాగంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న సమయంలో ప్రధాని మోడీ సైతం కీరవాణినీ అభినందించడం జరిగింది.
ఇక ఇదే తరహాలో ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో “నాటు నాటు” సాంగ్ ఆస్కార్ ఫైనల్ నామినేషన్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది.
తెలుగు సినిమా ఖ్యాతిని భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయి ప్రపంచ స్థాయిలో చాటుతున్న కీరవాణికీ ఏపీ నుండి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం పట్ల ఇండస్ట్రీకీ చెందిన ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది.ఇంకా తెలంగాణ నుంచి చిన్న జీయర్ స్వామీజీకి పద్మభూషణ్ అవార్డు దక్కింది.మొత్తం 25 మందికి కేంద్రం అవార్డులను ప్రకటించడం జరిగింది.
తెలుగు రాష్ట్రాలలో విద్య, సాహిత్యంలో తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి… ఏపీకి చెందిన సంకురాత్రి చంద్రశేఖర్ కు కూడా పద్మశ్రీ అవార్డులు లభించాయి.