మహారాష్ట్రలోని పతారే వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.నాసిక్ – షిర్డీ హైవేపై బస్సును లారీ ఢీకొట్టింది.
ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.
వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.బస్సు భక్తులతో షిర్డీకి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.