టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే డైరెక్టర్ బాబి మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమా వాల్తేరు వీరయ్య.ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న విడుదల కానున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.అలాగే ఇందులో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కూడా కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు, పోస్టర్ టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాకు సంబంధించిన పాటలే వినిపిస్తూ ఉండడంతో పండగ రాకముందే అప్పుడే సినిమా హావానే కనిపిస్తోంది.ఇకపోతే ఈ సినిమాలోని పూనకాలు లోడింగ్ సాంగ్ అయితే థియేటర్లో ప్రేక్షకులతో విజిల్స్ వేయించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.
రోజు రోజుకి ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరుగుతూనే ఉన్నాయి.ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ ను క మొదలు పెట్టే పనిలో పడ్డారు చిత్ర బృందం.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది.అయితే ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపింది.
అందుకు సంబంధించిన పోస్టర్ నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈసారి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో థియేటర్లో రచ్చరచ్చ చేయబోతున్నారని తెలుస్తోంది.బాక్సాఫీస్ వద్ద చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రికార్డు బ్రేక్ చేయడం ఖాయం అని, మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత అభిమానులు ఎలా చూడాలనుకున్నారు ఈ సినిమా అలా ఉండబోతుందని, ఎమోషనల్, యాక్షన్ సీన్స్ ఈ సినిమా కు హైలైట్ గా నిలుస్తాయని, చిరంజీవి రవితేజ కాంబినేషన్లో సన్నివేశాలు అయితే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా డైరెక్టర్ డిజైన్ చేశారు అంటూ బోర్డు సభ్యులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారట.