మంచు హీరో మనోజ్ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది.ఆ మధ్య అహం బ్రహ్మాస్మి సినిమా ను ప్రకటించిన మనోజ్ ఇప్పటి వరకు దాని అప్డేట్ ఇవ్వలేదు.
ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులు ఆ సినిమా గురించి మాట్లాడిన సమయంలో స్మైల్ ఈమోజీ ని షేర్ చేశాడు.దాన్ని బట్టే ఆ సినిమా పక్కకు పోయినట్లుగా అనిపిస్తుంది.
భారీ అంచనాల నడుమ మొదలు పెట్టిన ఆ సినిమా క్యాన్సిల్ అయినట్లే అంటూ అంతా భావిస్తున్నారు.ఈ సమయంలోనే మంచు మనోజ్ యొక్క కొత్త సినిమా ఎప్పుడు అంటూ మళ్లీ చర్చ మొదలు అయ్యింది.
తన భార్య నుండి విడి పోయిన తర్వాత ఇప్పటి వరకు మనోజ్ కొత్త సినిమా ను పట్టాలెక్కించలేదు.అసలు ఆయన సినిమా ఎప్పుడు చేస్తాడు అనేది కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.
మంచు మనోజ్ ప్రస్తుతం భూమా మౌనికా రెడ్డి తో ప్రేమలో ఉన్నాడు.ఆమె ను రెండవ వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి లో వారి పెళ్లి ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.అదే జరిగితే పెళ్లి తర్వాతే మనోజ్ కొత్త సినిమా ల యొక్క అప్‌డేట్స్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు.
మనోజ్ సన్నిహితులు మరియు మంచు ఫ్యామిలీ లో జరుగుతున్న చర్చ ప్రకారం వచ్చే ఏడాదికి మంచు మనోజ్ మరోసారి ఒక ఇంటి వాడు అవ్వబోతున్నాడు.
అప్పుడే మనోజ్ సినిమా ల పరంగా బిజీ అవ్వబోతున్నాడు.రెండవ పెళ్లి తర్వాత మనోజ్ వరుసగా సినిమా లు చేస్తాడు.పెళ్లి అయ్యేంత వరకు ఇదే పరిస్థితి అన్నట్లుగా ఆయన సన్నిహితులు ఆఫ్ ది రికార్డ్ మీడియా ముందు చెబుతున్నారు.
అప్పుడు అయినా మనోజ్ వరుస సినిమా లు చేసి సక్సెస్ లను దక్కించుకుంటాడేమో చూడాలి.