ముక్కులో నుంచి ఎప్పుడైనా రక్తం వస్తే వేడి చేసింది అని అంటారు.అదే చెవులో నుంచి రక్తం వస్తే ఏం అంటారు.
చెవులో నుంచి రక్తం రావడం అంత మంచిది కాదు.చెవులో నుంచి రక్తం రావడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయ్.
అందుకే చెవులో నుంచి రక్తం వచ్చిన సమయంలో దగ్గరలో ఉన్న డాక్టర్ ని కలవడం మంచిది.లేదంటే ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆ సమస్యలు ఏంటి ? ఏం చేస్తే వాటి నుంచి బయటపడుతాం అనేది మనం ఇప్పుడు చూద్దాం!
చెవి లోపల ఉన్న చర్మం పగిలినప్పుడు ఒక్కోసారి రక్తస్రావం జరుగుతుంది.అలా ఎప్పుడో కానీ జరగదు.
జరిగిన కొద్దిపాటి రక్తం కారి తగ్గిపోతుంది.ఇక అలా రక్తం కారినప్పుడు దానిని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
కుదిరితే ఒకసారి డాక్టర్ ని కలిస్తే మంచిది.
ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద సౌండ్లు, లౌడ్ స్పీకర్లు, స్విమ్మింగ్ ఫుల్ లో ఎత్తునుంచి దూకినప్పుడు చెవులో కర్ణభేరిపై ఒత్తిడి ఏర్పడి కర్ణభేరి పగిలిపోయే ప్రమాదం ఉంది.
ఆ సమయంలో చెవి నుంచి రక్తం వస్తుంది.
అప్పుడు తలకు బలమైన దెబ్బ తగిలిన, తలలో ఎముకలు విరిగిన చెవుల నుంచి రక్తం వస్తుంది.
ఇది చాలా ప్రమాదకరం.దీని వల్ల కొందరు స్పృహ తప్పి పడిపోతే మరికొందరు మృతి చెందుతారు.
ఇంకా చెవిలో రక్తం వచ్చెనందుకు ఎన్నో కారణాలు ఉన్నాయ్.అయితే అలా రక్తం రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.పెద్ద పెద్ద శబ్దాలు వినకూడదు.పెన్సిల్, పెన్, తాళం చెవులు వంటి వస్తువులు చెవులో పెట్టకుంటే మంచిది.
అది మాత్రమే కాదు చెవిలో పుండ్లు ఉంటే అశ్రద్ధ చెయ్యకుండా వైద్యులను సంప్రదిస్తే మంచిది.అది మాత్రమే కాదు చెవిలో వైద్యుల సలహా లేకుండా ఏది అంటే అది వేస్తే వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇక స్నానం చేసిన సమయంలో చెవిలోకి నీళ్లు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.