ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ల సంఖ్య చాలా పెద్దగానే ఉంది.కానీ ఆయన నుండి సినిమా లు మాత్రం బ్యాక్ టు బ్యాక్ రావడం లేదు.
ఈ ఏడాది లో రాధే శ్యామ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇదే ఏడాది ఆదిపురుష్ సినిమా తో కూడా రావాల్సి ఉంది.
కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు ఆదిపురుష్ సినిమా రాలేదు.గ్రాఫిక్స్ నాణ్యత విషయమై చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆలస్యం అవుతుంది అంటూ ప్రచారం జరుగుతోంది.2023 లో అయినా ఆదిపురుష్ సినిమా వస్తుందా అంటే అనుమానమే అన్నట్లుగా ప్రభాస్ అభిమానులు స్వయంగా కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో ప్రభాస్ 2023 సినిమాల జాబితా గురించి ప్రచారం జరుగుతోంది.
ఆయన సినిమాల షూటింగ్ పరిస్థితి చూస్తూ ఉంటే వచ్చే ఏడాదిలో కనీసం ఒక్క సినిమా కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తున్నారు.ఇక ప్రాజెక్ట్ కే సినిమా ను 2023 లో విడుదల చేయడం కష్టమే అన్నట్లుగా ఆ మధ్య చిత్ర యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ చెప్పుకొచ్చారు.అది కాకుండా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా ను చేస్తున్నాడు.
ఇటీవలే ఆ సినిమా ప్రారంభం అయ్యింది.కనుక విడుదల అయ్యేది అనుమానమే.
వచ్చే ఏడాదిలో ప్రభాస్ నుండి సలార్ వస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.ప్రశాంత్ నీల్ పై ఆశలు పెట్టుకుని ఉన్నారు.
ఆ ఒక్క సినిమా అయినా వచ్చే ఏడాది వస్తుందా లేదంటే దాన్ని కూడా వాయిదా వేసి ఫ్యాన్స్ కి చిరాకు కలిగిస్తారా అనేది చూడాలి.ఈ ఏడాది ఎలాగూ ప్రభాస్ కు కలిసి రాలేదు.
కనీసం వచ్చే ఏడాది అయినా ప్రభాస్ కు కలిసి వస్తుందా అనేది అభిమానులను వేదిస్తున్న ప్రశ్న.







