ఈడీ విచారణకు గైర్హాజరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు.తన దాఖలు చేసిన పిటిషన్ రేపు బెంచ్ మీదకు వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుపై న్యాయవాదులతో చర్చిస్తానన్నారు.ఈ నేపథ్యంలో న్యాయవాదులు వెళ్లమని చెబితే ఈడీ కార్యాలయానికి వెళ్తానని స్పష్టం చేశారు.
ఎవరినైనా పంపమంటే లేఖ ఇస్తానని రోహిత్ రెడ్డి తెలిపారు.దీంతో రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు వెళతారా.? లేదా .? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.