ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప.350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమా తో పుష్పరాజ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వైరల్ గా మారింది.మరి గత రెండేళ్లుగా అల్లు అర్జున్ ఒకే సినిమాకు సమయం ఇచ్చాడు.ఈయన పుష్ప తర్వాత మరొక సినిమాను అనౌన్స్ చేయలేదు.
పుష్ప ది రూల్ ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది.
ఈ క్రమంలోనే ప్రెజెంట్ అల్లు అర్జున్ ఈ సినిమా కోసమే తన సమయాన్ని కేటాయించాడు.ఈ సినిమా ఈ మధ్యనే స్టార్ట్ అవ్వడంతో 2024 లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
పుష్ప 2 కూడా భారీ విజయం అవుతుంది అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
ఇది ఇలా ఉండగా ఈయన నెక్స్ట్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.
ఇక తాజాగా అల్లు అర్జున్ నెక్స్ట్ లైనప్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.ఈయన నెక్స్ట్ సినిమా రేసుగుర్రం కాంబోలో ఉండబోతుంది అని టాక్ బలంగా వినిపిస్తుంది.
రేసుగుర్రం అల్లు అర్జున్ కెరీర్ లో ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది చెప్పాల్సిన పని లేదు.

ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసాడు.ఇక ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ కాంబో రిపీట్ అవుతుంది అని అంటున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే సురేందర్ రెడ్డి అల్లు అర్జున్ కు కథ చెప్పి ఓకే చేయించాడు అని తెలుస్తుంది.

ప్రెజెంట్ సురేందర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.ఆ తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాల్సి ఉండగా ఆయన వరుస కమిట్మెంట్స్ కారణంగా ఆలస్యం అయ్యేలా ఉంది.అందుకే ఈయన అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు అని టాక్.
దీంతో అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబో మరోసారి రిపీట్ అయ్యేలానే కనిపిస్తుంది.







