యాపిల్ ఐ ఫోన్లు, ఇతర ప్రొడక్టులు బాగా ఖరీదుగా ఉంటాయి.వాటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.
వాటిలో భద్రతా ఫీచర్లు అత్యాధునికంగా ఉంటాయి.ఈ తరుణంలో అవే భద్రతా ఫీచర్లు యాపిల్ సంస్థకు కొత్త చిక్కులు తెచ్చాయి.
తమ గోప్యతను యాపిల్ సంస్థ టెక్నాలజీ భంగం చేసిందని ఇద్దరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.యాపిల్ సంస్థపై కోర్టులో దావా వేశారు.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

యాపిల్ సంస్థపై ఇద్దరు మహిళలు దావా వేశారు.యాపిల్ ఎయిర్‌ట్యాగ్ పరికరాలు తమ గోప్యతను హరించాయని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.తమ మాజీ లవర్స్, ఇతర స్టాకర్లకు తమను గుర్తించడాన్ని సులభతరం చేశాయని చెప్పారు.
శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో సోమవారం దావా వేశారు.ఏప్రిల్ 2021లో “స్టాకర్ ప్రూఫ్” పరికరాన్ని ప్రారంభించినప్పటి నుండి యాపిల్ ఎయిర్ ట్యాగ్ ద్వారా తమను సంస్థ కాపాడలేకపోయిందని, పైగా సమస్యల్లో పడేసిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.29 డాలర్ల ఖరీదు ఉండే ఎయిర్‌ట్యాగ్‌లతో మనం కీలు, వాలెట్‌లు, బ్యాక్‌ప్యాక్‌లు, ఇతర వస్తువులు పోగొట్టుకున్నప్పుడు వాటిని కనుగొనగలిగేలా చేయడానిక సహాయపడతాయి.అయితే కొందరు వ్యక్తులు నేరపూరిత లేదా హానికరమైన ప్రయోజనాల కోసం ఎయిర్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నారని భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు.
ఫిర్యాదు చేసిన మహిళలు ఎయిర్‌ట్యాగ్‌ను “స్టాకర్లు, దుర్వినియోగదారులకు బాగా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.ఈ సంవత్సరం అక్రోన్, ఒహియో, ఇండియానా పోలిస్ ప్రాంతాలలో మహిళల హత్యలతో ముడిపడి ఉందని చెప్పారు.
ఎయిర్ ట్యాగ్ ద్వారా ట్రాక్ చేయబడిన ఐఓఎస్ లేదా ఆండ్రాయిడ్ ఆధారిత పరికరాల యూజర్లకు ఇది నష్టాన్ని కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు.ఇక బాధిత మహిళ లారెన్ హ్యూస్ మాట్లాడుతూ, తన మాజీ ప్రియుడు తన కారు చక్రంలో ఎయిర్‌ట్యాగ్‌ను ఉంచిన తర్వాత తాను ఎక్కడికి వెళ్తున్నానో అతడు తెలుసుకున్నాడని తెలిపారు.