తోడేళ్ళ గురించి మనకు బాగా తెలుసు.నక్కల గురించి కూడా మనకు తెలుసు.
ఆ రెండు జంతువులు ఎలా ఉంటాయంటే టక్కున చెప్పగలం.అయితే మనలో చాలామంది ‘మేన్డ్ వోల్ఫ్’ గురించి విని ఉండకపోవచ్చు.
నక్క లేదా తోడేలు రెండు జంతువుల రూపాన్ని కలిగిన ఓ వింత జంతువు సంచారం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది.ఆ వింత జీవి సంచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
దీనిని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.ఒకింత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ఇంటర్నెట్ యూజర్ రెగ్ సాడ్లర్ ట్విట్టర్‌లో ఈ ఆసక్తికర వీడియోను ఇటీవల పోస్ట్ చేశారు.ఆ వీడియోలో ఆ వింత జంతువు చాలా ప్రశాంతంగా రోడ్డు దాటుతోంది.విచిత్రం ఏమిటంటే ఈ జంతువును చూడగానే మనకు మొదటి చూపులో తోడేలుగా కనిపిస్తుంది.
దగ్గరగా పరిశీలించి చూస్తే, అది నక్కను పోలి కనిపిస్తుంది.అయితే, ఇది ఏ వర్గానికి చెందినది కాదు.
అదే చూసి ఆనందించిన వినియోగదారు, “ఇది ఏంటో ఎవరికైనా తెలుసా?!” అని క్యాప్షన్ ఇచ్చారు.ఈ వీడియో షేర్ చేసినప్పటి నుండి ఈ పోస్ట్‌కి రెండు మిలియన్ల వ్యూస్ దక్కాయి.
అలాంటి జంతువును చూసి చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు ఆశ్చర్యపోయారు.కొందరు ఇది హైనా అని భావించారు, మరికొందరు వీడియో ఫేక్ అని పేర్కొన్నారు.ఒక వినియోగదారు ఇలా అన్నారు.‘నకిలీగా కనిపిస్తోంది, మెడ మీద నల్లటి బొచ్చు కనిపించడం, అదృశ్యం అవుతూనే ఉంటుంది’ అని కామెంట్ చేశారు.కొందరు మాత్రం మరో విధంగా ఆ జంతువు గురించి కామెంట్ చేశారు.ఇది కుక్కల జాతికి చెంది జీవి అని, అయితే సంకర జాతికి చెంది కుక్క అని భావిస్తున్నట్లు చెప్పారు.
ఇంకొందరు మాత్రం ఈ విచిత్ర జీవిని తాము ఎక్కడా చూడలేదని, భయం గొలిపేలా ఉందని పేర్కొన్నారు.