తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
వచ్చే ఎన్నికలలో ఎలా అయినా గెలవాలి అని పవన్ కళ్యాణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ నేపథ్యంలోనే కమిట్ అయిన సినిమాలను కూడా పక్కనపెట్టి రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు పవన్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు రాజకీయాలలో పాల్గొంటుండడం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
రెండు పడవల మీద కాలు ఎందుకు వేస్తున్నాడు ఏదైనా ఒకటి చూసుకోవచ్చు కదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే తాజాగా అటువంటి వార్తలకు చెక్ పెట్టేసారు పవన్.తాజాగా ఆ విషయంపై స్పందించిన పవన్ కళ్యాణ్ తాను డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నానని రాజకీయం దేశం కోసం చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.
స్వతహాగా పార్టీని నడిపించాలని సినిమాలు చేస్తున్నాను.ఆ సినిమాలలో నటించి వచ్చిన డబ్బుతోనే పార్టీని నడుపుతున్నాను అని చెప్పుకొచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఎందుకంటే ఒకరి దయాదాక్షిన్యాలు ఒకరిచ్చే ఫండింగ్ తో తన పార్టీ నడపడం తనకు ఇష్టం లేదని, అందుకే నచ్చిన పనులు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు.
![Telugu Harihara, Janasena, Pawan Kalyan, Tollywood-Movie Telugu Harihara, Janasena, Pawan Kalyan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/12/pawan-kalyan-talking-about-movies-pawan-kalyan.jpg )
పవన్ చెప్పిన విధంగానే ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ ముందుగానే నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.అయితే నిర్మాతల నుంచి అడ్వాన్స్ అయితే తీసుకుంటున్నాడు కానీ సినిమాల షూటింగ్ లేట్ అవుతుండడంతో మధ్యలో నిర్మాతలు బలి అవుతున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇప్పటికే కొన్ని సినిమాలకు పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో షూటింగ్ ఇంకా మొదలు కాకముందే ఇంకొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటున్నాడు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.మరి పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలన్నీ ఎప్పుడు పూర్తి చేస్తాడో ఎప్పుడు రాజకీయాలలో పాల్గొంటాడో చూడాలి మరి.