అనంతపురం జిల్లా రాప్తాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి నివాసం ముట్టడికి టీడీపీ శ్రేణులు ప్రయత్నించారు.
మరోవైపు తోపుదుర్తి చందు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.అయితే ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి బయలుదేరిన నేతలను పోలీసులు మార్గ మధ్యలోనే అడ్డుకున్నారు.
ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అనంతరం తెలుగు యువత, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అదేవిధంగా అనంతపురంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.