వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పారు.తన పైన తమ ప్రభుత్వం పైన సీఎం జగన్ పైన ఎవరు విమర్శలు చేసినా, విజయసాయిరెడ్డి ఘాటుగానే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా, విమర్శలు చేస్తూ ఉంటారు.
గత కొంతకాలంగా జగన్ ను టార్గెట్ చేసుకుంటూ టిడిపి జనసేన పార్టీల నాయకులు విమర్శలు చేస్తుండడంపై విజయ్ సాయి రెడ్డి తనదైన శైలిలో స్పందిస్తూనే వస్తున్నారు.ప్రస్తుతం విశాఖ , ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయాలపై దృష్టి సారించిన విజయసాయి అక్కడ పార్టీకి తిరుగులేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతోపాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ, తమ రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలకు కౌంటర్లు ఇస్తూ ఉంటారు.
తాజాగా సీఎం జగన్ ప్రైవేట్ విమానాల ద్వారా నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారు అంటూ టిడిపి నేత పట్టాభిరామ్ చేసిన విమర్శలకు విజయ సాయిలు గట్టి కౌంటర్ ఇచ్చారు.
పట్టాభికి దేవుడు దున్నపోతులా శరీరాన్ని ఇచ్చాడు.కానీ ఆవగంజంత కూడా మెదడు పెట్టడం మర్చిపోయాడురా అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.” ఒరేయ్ పొట్టాభి’ ! హోటల్ మేనేజ్మెంట్ డిప్లమో చేసి సర్వర్ గా పని చేస్తున్న నిన్ను బాబు పార్టీలోకి తెచ్చాడు.హోటల్లో తిని తిని సీమ పందిలా వాళ్లు తేలేట్టు బలిసావ్.
సింగపూర్ లో హోటల్స్, స్వీస్ బ్యాంకుల్లో నల్ల డబ్బు దాచింది, మలేషియాలో వెయ్యి కోట్లు పోగొట్టుకున్నదెవరో బాబుని అడుగు.” అంటూ కౌంటర్ ఇచ్చారు.ఇక మరో ట్వీట్ లో టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి కామెంట్స్ చేశారు.తనకు కాలం చెల్లిందని మా అన్నయ్య చంద్రబాబు స్వయంగా గ్రహించడం / అంగీకరించడం ఆయన రాజకీయ చాణిక్యతకు నిదర్శనం.40 ఇయర్స్ ఇండస్ట్రీ నేర్పిన నికార్సేన నిజం.ఇప్పుడు ఆయన తుప్పు కాదు.
వృద్ధనారీ ప్రతివ్రత.పతివ్రత కూడా ! అందుకే రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్ కాబోతుందంటూ విజయ సాయి రెడ్డి సెటైర్లు వేశారు.