సూపర్ స్టార్ కృష్ణ నేడు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.ఇక ఈయన మరణించడంతో ఎంతోమంది ఆయనతో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకోవడమే కాకుండా ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కృష్ణ మరణం గురించి ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రెటీల సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటించగా తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం కృష్ణ మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా ఈయన కృష్ణ మృతి పై స్పందిస్తూ కృష్ణ గారు మరణించారని ఎవరు బాధపడకండి.
ఇప్పటికే ఆయన స్వర్గానికి వెళ్లి విజయనిర్మల గారితో కలిసి ఎంతో సంతోషంగా ఆనందంగా ఆమెతోగడుపుతూ ఉంటారని వర్మ కృష్ణ మరణం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈయన కృష్ణ మరణం పై స్పందించడమే కాకుండా విజయనిర్మల కృష్ణ కలిసిన నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాలో పాటను కూడా జత చేశారు.
కృష్ణ మరణించిన అనంతరం ఆయన మరణం పట్ల వర్మ ఈ విధమైనటువంటి ట్వీట్ చేయడంతో ఇది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.ఇకపోతే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా కృష్ణ మరణం పట్ల నివాళులర్పించడమే కాకుండా మరి కొంతమంది ఆయన నివాసానికి చేరుకొని కృష్ణ గారికి నివాళులు అర్పించడమే కాకుండా మహేష్ బాబు కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు.ఇకపోతే ఓకే ఏడాదిలో మహేష్ బాబు తన సోదరుడు తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోవడం ఎంతో బాధాకరం.