టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారికి చెందుతుందని చెప్పాలి.ఇలా ఎన్నో ధైర్య సాహసాలు కలిగిన సినిమాలలో నటించిన కృష్ణ గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా సదరు సెలబ్రిటీలు సైతం కృష్ణ గారికి అభిమానులు అంటే ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన పనిలేదు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి సైతం కృష్ణ గారికి వీరాభిమాని.
ఎంతగా అంటే ఆయన పేరిట అభిమాన సంఘాన్ని కూడా స్థాపించే అంత అభిమానం చిరంజీవికి ఉంది.
ఇలా తెలుగు చిత్రపరిశ్రమలో దాదాపు ఐదు దశాబ్దాల నుంచి చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించిన కృష్ణ గారు నేడు మరణించారు.
ఇలా కృష్ణ మరణించడంతో చిత్ర పరిశ్రమ ఎంతో దిగ్భ్రాంతికి లోనైంది.తెలుగు చిత్ర పరిశ్రమ సగర్వంగా తలెత్తుకొనేలా చేసిన సినిమాలలో నటించిన కృష్ణ మరణ వార్త అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలను సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇక ఈయన మరణించడంతో ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా ఎంతో గుర్తింపు పొందిన నందమూరి తారక రామారావు తర్వాత అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో కృష్ణ.
ఈయనకు ఏకంగా 2500 అభిమాన సంఘాలు ఉండేవి అంటే ఈయన క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున కృష్ణ గారికి అభిమాన సంఘాలు ఉండేవి.ఇక ఈ అభిమాన సంఘానికి నాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరించడం విశేషం.చిరంజీవి యువకుడిగా ఉన్న సమయంలో ఆయన కృష్ణ గారికి వీరాభిమాని.
ఈ క్రమంలోనే పద్మాలయ కృష్ణ ఫాన్స్ యూనిట్ పేరుతో అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు.ఈ అభిమాన సంఘానికి చిరంజీవి నాయకుడిగా వ్యవహరించేవారు.
తోడు దొంగలు ప్రమోషన్‌లో భాగంగా ఈ అభిమాన సంఘం పేరిట విడుదల చేసినటువంటి ఒక కరపత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చిరంజీవి సైతం కృష్ణ గారికి అభిమాని అని తెలుస్తుంది.