సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.కౌబాయ్ జేమ్స్ బాండ్ వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత కృష్ణ గారికి ఉంది.
ఇలా ఇండస్ట్రీలో నటుడిగా సుమారు 340 సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణ గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరిన కృష్ణ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
ఇలా ఈయన మరణించడంతో ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు ప్రేక్షకులు ఈయన మరణ వార్తపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే చాలామంది ఈయన నటించిన సినిమాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.

ఇకపోతే కృష్ణ గురించి గతంలో మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.తండ్రి ఒక సూపర్ స్టార్ గా కొనసాగుతూ సినిమాల ఎంపిక విషయంలో తన కొడుకుకి ఎలాంటి సలహాలు ఇచ్చారు అనే విషయంపై మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.సినిమా ఎంపిక విషయంలో తన తండ్రి ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోలేదని తన కష్టాన్ని తానే పడాలనీ చెప్పేవారని వెల్లడించారు.ఈ క్రమంలోనే తాను నటించిన మురారి సినిమా రివ్యూ చూసినటువంటి తన తండ్రి భుజం మీద చేతులు వేసి ఎంతో ఆప్యాయంగా తనని తట్టారని అదే ఆ సినిమాకు ఆయన ఇచ్చిన గొప్ప ప్రశంసలు అంటూ మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేశారు.

ఇక మహేష్ బాబు తన సినీ కెరీర్ లో నటించిన ప్రయోగాత్మక చిత్రం నాని.ఈ సినిమా రివ్యూ చూసిన అనంతరం కృష్ణ మాట్లాడిన మాటలు తనకు వేకప్ కాల్ గా అనిపించాయని మహేష్ వెల్లడించారు.ఈ సినిమా చూసిన నాన్న ఈ సినిమా కనుక హిట్ అయితే నువ్వు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగలేవంటూ నాని సినిమాపై జడ్జిమెంట్ ఇచ్చారట.అలా ఆరోజు కృష్ణ గారు నాని సినిమాపై ఇచ్చిన జడ్జిమెంట్ అక్షరాల నిజమైందని ఆ సినిమా డిజాస్టర్ టాక్ అయిన సంగతి తెలిసిందే.
అయితే సినిమాల విషయంలో ఫర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఉన్నటువంటి కృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇలాంటి అద్భుతమైన నటుడు ఇక లేరనే వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.







