తెలంగాణ గవర్నర్ తమిళిసైతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం అయ్యారు.ఈ మేరకు రాజ్ భవన్ కు వెళ్లిన మంత్రి సబితా గవర్నర్ తో భేటీ అయ్యారు.
కామన్ రిక్రూట్ మెంట్ బిల్లుపై గవర్నర్ కు ఉన్న అభ్యంతరాలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు వివరణ ఇవ్వనున్నారు.కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటుకు నామ్స్ ఏంటి? బోర్డు ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారు ? అనే విషయాలపై చర్చించనున్నారు.బోర్డుకు ఛైర్మన్ గా ఎవరుంటారు? .అధ్యాపకులు, సిబ్బంది నియామకాల్లో ఎలాంటి విధానాలు అవలంభిస్తారు అనే పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.