సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
సినిమా పూర్తి గా సరోగసి విధానం పై రూపొందినట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.ప్రస్తుతం సమంత మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంది.
అయినప్పటికీ యశోద సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక యశోద సినిమా ఫలితం ఆధారంగా ఆమె నటించిన మరో సినిమా శాకుంతలం రిలీజ్ డేట్ ఉంటుంది అంటూ సమాచారం అందుతుంది.
గుణశేఖర్ దర్శకత్వం లో రూపొందుతున్న శాకుంతలం సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యి చాలా నెలలు అయింది.ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన వర్క్ జరుగుతుందని తెలుస్తుంది.
ముందుగా ప్రకటించిన దాని ప్రకారం సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం అవుతుండడం తో వచ్చే సంవత్సరానికి సినిమా ను వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. యశోద సినిమా సూపర్ హిట్ అయ్యి సమంత క్రేజ్ మరింతగా పెరిగితే శాకుంతలం సినిమా వెంటనే విడుదల అయ్యే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
విభిన్నమైన కాన్సెప్ట్ తో మొదటి సారి సమంత ఇలాంటి పాత్ర ను చేయడం తో అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

కనుక తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విషయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.యశోద సినిమా సక్సెస్ అయితే శాకుంతలం సినిమా ఆలస్యం లేకుండా వెంటనే విడుదల అయ్యే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు మీడియా సర్కిల్స్ వారు కూడా మాట్లాడుకుంటున్నారు.యశోద సినిమా తెలుగు తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.







