బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధిక ఆప్టే గురించి మనందరికీ తెలిసిందే.ఈమె బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
ఈమె సినిమాల ద్వారా కంటే సెన్సేషనల్ కామెంట్స్ బోల్డ్ డైలాగులతో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటిని సొంతం చేసుకుంది.రాధిక ఆప్టే కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు ఫోటోషూట్లతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.
మరి ముఖ్యంగా ఈమె కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో బాగా పాపులర్ అయింది అని చెప్పవచ్చు.తెలుగులో కూడా పలు సినిమాలు నటించినప్పటికీ ఈమెకు తగిన విధంగా గుర్తింపు దక్కకపోవడంతో మళ్లీ బాలీవుడ్ కి చెక్కెసింది.
సినిమా అవకాశాలతో పాటుగా వెబ్ సిరీస్ అవకాశాలను కూడా వదులుకోవడం లేదు రాధిక ఆప్టే.అయితే ఈమె సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు అప్పుడప్పుడు కొన్ని సూత్రాలు తెలుపుతూ ఉంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో లవర్స్ కి ఒక సలహా ఇచ్చింది.మీ భాగస్వామితో మీకు గొడవలు జరిగినా, మనస్పర్థలు వచ్చినా కూడా వాటిని వేరే వారితో పంచుకోకండి.
మీ మధ్యకు మరెవరినో తీసుకురాకండి.మీ విషయాలను వారికి చెప్పడం వల్ల మీకు ఎలాంటి లాభం ఉండదు.
ఎందుకంటే మీ సమస్యలకు పరిష్కారం మీరే వెతుక్కోవాలి.
కానీ ఇంకొక వ్యక్తిని తీసుకురావడం వల్ల మీ మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.కాగా ఆమె వ్యాఖ్యలపై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ.ఇవన్నీ నీ సొంత అనుభవంతో చెబుతున్నావా అని కొందరు కామెంట్ చేయగా, లేదా నీకు తెలిసిన వాళ్ళ లైఫ్ లోకి తొంగి చూసావా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు మాత్రం నీతులు మాకు చెప్పడం కాదు నువ్వు కూడా పాటించు అంటూ ఆమెపై ట్రోలింగ్స్ చేస్తున్నారు.అలా ఆమె లవర్స్ విషయంలో చెప్పిన వాఖ్యలపై పలువురు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా ఇంకొందరు మాత్రమే నెగటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.