తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీకి పయనమైయ్యారు.ఈ మేరకు సాయంత్రం ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు.
అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులకు ఆమోదం తెలిపే అంశంపై అమిత్ షాతో చర్చించనున్నారు.అనంతరం ఇతర కేంద్ర మంత్రులను కూడా గవర్నర్ తమిళిసై కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే మునుగోడు ఉపఎన్నిక ఫలితాల తర్వాత గవర్నర్ హస్తిన పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.







