ఆనంద్ మహీంద్రా, పరిచయం అక్కర్లేని పేరు.ఈ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం సినిమా సెలిబ్రిటీలకు తీసిపోని రీతిలో వ్యవహరిస్తూ వుంటారు.
ఇంకా చెప్పాలంటే వారికంటే యాక్టివ్ గా సోషల్ యాక్టివిటీస్ గురించి సోషల్ మీడియాలో నిత్యం పంచుకుంటూ వుంటారు.అందుకనే ఆనంద్ మహీంద్రాకి ఒక సెలిబ్రిటీకి వున్న రీతిలో అభిమానులు వుంటారు.
తాజాగా ఈయన ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసి, తన హృదిలో వున్న ఎమోషన్ ని తెలియజేసారు.NDA (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) మాజీ డ్రిల్ ఇన్‌స్ట్రక్టర్ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన ఆ వీడియోని చూస్తే మీకే అర్ధం అవుతుంది.
అవును, వందేళ్ల వయసు కలిగిన ఆయన సెల్యూట్ చేసిన సమయంలో తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని తన ట్వీట్లో పేర్కొన్నారు.అతను దాన్ని పోస్ట్ చేస్తూ… “100వ పుట్టిన రోజు సందర్భంగా NDA మాజీ డ్రిల్ ఇన్‌స్ట్రక్టర్ సుబేదార్ మేజర్ గోవింద స్వామిని సత్కరించారు.
వృత్తి జీవితంలో ఆయన ఏడుగురు భారత ఆర్మీ జనరల్స్‌కు శిక్షణ ఇచ్చారు.గురువులను గౌరవించడం మన భారతీయ సంప్రదాయం.ఈ వీడియోలో ఆయన సెల్యూట్ చేసిన క్షణంలో నాకు గూస్‌బంప్స్ వచ్చాయి” అని క్యాప్షన్ పెట్టారు.బెంగళూరులో ‘మద్రాస్ సాపర్స్ డే’ వేడుకల వేళ ఈ సత్కార కార్యక్రమం నిర్వహించారు.
గోవింద స్వామి సేవలకు గుర్తింపుగా ఆయన ప్రతిమను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.“మద్రాస్ సాపర్స్ డ్రిల్ ఐకాన్ కెప్టెన్ గోవిందస్వామి స్వయంగా తన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రిపబ్లిక్/ఆర్మీ డే పరేడ్ సందర్భంగా బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ ట్రోఫీని మద్రాస్ సాపర్స్ తొమ్మిదిసార్లు గెలుచుకోవడం వెనుక ఆయన పాత్ర ఉంది” అని ఆర్మీ సదరన్ కమాండ్ పేర్కొంది.మరోవైపు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చూసి నెటిజన్లు కూడా ఉద్వేగభరితులయ్యారు!
.