నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడ జిల్లా సాధన కోసం కొనసాగుతున్న వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలకు మిర్యాలగూడ యోగా క్లబ్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు యోగా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చీదెళ్ళ వెంకటేశ్వర్లు,కోలా సైదులు తెలిపారు.బుధవారం స్థానిక మేరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక గ్రంథాలయంలో జరిగిన యోగా శిక్షణలో వారు మాట్లాడారు.
జిల్లా ఏర్పాటు ప్రజలందరి ఆకాంక్ష అని,జిల్లా ఏర్పాటు చేయాలని జరుగుతున్న ఉద్యమానికి అందరూ మద్దతు పలకాలని కోరారు.గత 60 రోజుల నుండి వివిధ రూపాల్లో మిర్యాలగూడ జిల్లా సాధన సమితి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో చైతన్యం తీసుక వస్తోందన్నారు.
సాధన సమితి కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతోపాటు,ఉద్యమంలో భాగస్వామ్యం అవుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పైడిమర్రి సురేష్,కొండూరు నరేందర్,రాజేందర్,పంతులు నాయక్,మాలోతు దశరధ నాయక్,ప్రవీణ్,అంబటి కృష్ణ,మామిడి నాగయ్య,యమున,రమాదేవి,శోభ రాజు,శ్యామల తదితరులు పాల్గొన్నారు.