యాదాద్రి జిల్లా:రామన్నపేట మహిళా సర్పంచ్ గోదాసు శిరీష చెక్ పవర్ ను శనివారం జిల్లా కలెక్టర్ రద్దు చేశారు.గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినందుకు సర్పంచ్ చెక్ పవర్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రద్దు చేసి ఎంపిడివోకి చెక్ పవర్ ఇచ్చారు.
సర్పంచ్ పై ఉప సర్పంచ్ కిషన్ చేసిన ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ విచారణ జరిపారు.విచారణలో సర్పంచ్ గోదాసు శిరీష ఇచ్చిన వివరణలో నిజం లేదని గుర్తించి చెక్ పవర్ రద్దు చేసినట్లు తెలుస్తోంది.