సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అన్ని భాషలలో విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న దివంగత నటి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే.భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో ఎంతో వైవిద్య భరితమైన సినిమాలలో నటించి నటిగా గుర్తింపు పొందిన శ్రీదేవి అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
ఇక ఇండస్ట్రీ నుంచి శ్రీదేవి దూరం కావడంతో ఆమె కుమార్తె జాన్వీ కపూర్ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే బాలీవుడ్ సినిమాలు చేస్తూ నటిగా ఎంతో బిజీగా ఉన్న జాన్వి కపూర్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఈమె శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.
స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న జాన్వీ కపూర్ అనంతరం ఆలయం వెలుపల సందడి చేశారు.

స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఈమెను చూసి ఫోటోగ్రాఫర్స్ ఒక్కసారిగా తన ఫోటోలను వారి కెమెరాలలో బంధించారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో ఎప్పుడు గ్లామరస్ డ్రెస్సులలో అందాలనారబోస్తూ సందడి చేసే జాన్వీ కపూర్ స్వామివారి దర్శనం కోసం ఎంతో సాంప్రదాయపద్ధంగా లంగా వోని ధరించి, చూడముచ్చటగా ఎంతో అందంగా ముస్తాబై వచ్చారు.
ఇలా జాన్వీ కపూర్ ని చూసిన అభిమానులు అసలు ఇక్కడ మనం రోజు చూసే జన్వీనేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.ఇలా ఆలయం వెలుపలకు వచ్చిన ఈమె చకచకా కారు వద్దకు చేరుకొని తిరిగి గెస్ట్ హౌస్ వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
.