కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా తన స్వగ్రామానికి భారీ విరాళాన్ని ప్రకటించారు.ప్రశాంత్ నీ తండ్రి సుభాష్ నీలకంఠాపురం 75వ జయంతి సందర్భంగా నీలకంఠాపురంలో ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి దాదాపుగా 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.
కాగా ఇదే విషయాన్ని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత అయిన రఘువీరారెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.నీలకంఠాపురం గ్రామానికి ప్రశాంత్ నీల్ ఎందుకు అంత విరాళం ఇచ్చారు? ప్రశాంత్ నీల్ రఘువీర్ రెడ్డి కి మధ్య సంబంధం ఏంటి?ఈ విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం.
ప్రశాంత్ నీల్ ఎవరో కాదు.రఘువీరారెడ్డి సోదరుడు అయినా సుభాష్ రెడ్డి కుమారుడే.ప్రశాంత్ నీల్ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం వాసి.ప్రశాంత్ నీల్ పేరులోనే నీలకంఠాపురం ఉంది.
అయితే ప్రశాంత్ నీల్ అసలు పేరు ప్రశాంత్ నీలకంఠాపురం.ప్రశాంత్ నీలకంఠాపురం పేరు కాస్త ప్రశాంత్ నీల్ గా మారింది.
ఇక ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి నీలకంఠాపురం ఇటీవల చనిపోయారు.ఆయనను నీలకంఠాపురంలోనే ఖననం చేశారు.
ప్రశాంత్ నీల్ś దర్శకత్వం వహించిన కేజీఎఫ్ 2 సినిమా విడుదల రోజున కూడా తన స్వగ్రామానికి వచ్చి తన తండ్రి సమాధిని సందర్శించి వెళ్లారు.

తన బంధువులంతా నీలకంఠాపురం వాసులే కావడంతో తరచూ నీలకంఠాపురం గ్రామానికి వచ్చి వెళ్తుంటారు దర్శకుడు ప్రశాంత్.కాగా మనకి స్వాతంత్య్రం వచ్చిన రోజునే ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి జన్మించారు.అంటే అటు 75 స్వాతంత్య్ర దినోత్సవం,ఇటు తండ్రి 75వ జయంతి కావడంతో సొంత ఊరు నీలకంఠాపురంలో ఉన్న ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు ప్రశాంత్ నీల్.ఇకపోతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా ఇటీవలే విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్లను కురిపించింది.