అమరావతిపై నిజాలు చెప్పడానికే బీజేపీ యాత్ర

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షణకై ఏపీ బీజేపీ ముందడుగు వేసింది.ఇందులో భాగంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టింది.

 Ap Bjp Somu Veerraju Started Manam Mana Amaravathi Padayatra In Undavalli Detail-TeluguStop.com

‘మనం.మన అమరావతి’ నినాదంతో బీజేపీ పాదయాత్ర ను చేపట్టింది.

ఈ పాదయాత్రలో భాగంగా అమరావతి రాజధాని, రాజధాని నిర్మాణానికి కేంద్ర ఇచ్చిన నిధులు, చేస్తున్న పనులుపై గడప గడపకు ప్రచారం చేయనున్నారు.అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో వారం రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాతుంది.

ఉండవల్లిలో రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాదయాత్రను ప్రారంభించారు.అలాగే, ఈ యాత్రలో కేంద్ర, రాష్ట్ర, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొంటున్నారు.

ఆగస్టు 4న తుళ్ళూరు బహిరంగ సభతో బీజేపీ సంకల్పయాత్ర ముగియనుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంగా రూపుదిద్దుకోవలసిన అమరావతిలో ఆనాడు చంద్రబాబు నిర్మించిన తాత్కాలిక రహదారులు, భవనాలే తప్ప వైఎస్ జగన్ సర్కారు కొత్తగా ఒక్క రోడ్డు వేయలేదు.

ఒక్క భవనం నిర్మించలేదు.కనీసం నిర్మాణంలో ఉన్నవాటిని కూడా పూర్తిచేయలేదు.మూడు రాజధానులు అంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం మూడేళ్ళ నుంచి కాలక్షేపం చేస్తోంది.ఆంధ్రులకు రాజధాని లేకుండా చేసిన పాపంలో వైసీపీ, టీడీపీకి సమాన బాధ్యత ఉంది.

ప్రజల ఆకాంక్షలను అర్దం చేసుకోకుండా అమరావతిని పాడుబెట్టినందుకు ప్రజలు వైసీపీని శిక్షిస్తారని బీజేపీ చీఫ్ సోమ్ వీర్రాజు అన్నారు.

తెలుగుదేశం పార్టీ, వైఎస్ జగన్ సర్కారు రాష్ట్ర రాజధాని విషయంలో చేస్తున్న మోసాన్ని ప్రజలను వివరించేందుకే….

Telugu Amaravathi, Ap Bjp, Ap, Chandrababu, Cmjaganmohan, Manammana, Somu Veerra

మనం-మన అమరావతి పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చెప్పారు.ఈ పాదయాత్ర అమరావతికి స్థలం ఇచ్చిన 29 గ్రామాల గుండా సాగుతుందన్నారు.ఈ పాదయాత్రలో బీజేపీ నాయకులు అమరావతి రాజధాని, రాజధాని నిర్మాణానికి కేంద్ర ఇచ్చిన నిధులు, చేస్తున్న పనులుపై గడప గడపకు ప్రచారం చేయనున్నారు.ఉండవల్లిలో ప్రారంభమైన ఈ యాత్ర వారం రోజుల పాటు సాగుతుంది.

ఈ యాత్రలో కేంద్ర, రాష్ట్ర, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొనేలా ప్లాన్ చేశారు.ఆగస్టు 4 వ తేదీ సాయంత్రం తుళ్ళూరు బహిరంగ సభతో అమరావతి బీజేపీ సంకల్పయాత్ర ముగిస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Telugu Amaravathi, Ap Bjp, Ap, Chandrababu, Cmjaganmohan, Manammana, Somu Veerra

అమరావతి విషయంలో రాజకీయ పార్టీలు మొసలి కన్నీళ్ళు కార్చుతూ ప్రజల భావోద్వేగాలతో ఆటలాడుకొంటున్న నేతల బండారం బటయపెట్టడానికి మనం-మన అమరావతి యాత్రకు శ్రీకారం చుట్టినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ రాష్ట్రాన్ని మోసం చేయలేదని… రాజధానిలో ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బైపాస్ రోడ్లు, ఫ్లైఓవర్‌ ఓవర్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే నిర్మించారన్నారు.రాజధానిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube