భీమవరం చేరుకున్న అల్లూరి కాంస్య విగ్రహం..15 టన్నుల బరువు.. 30 అడుగుల పొడవు

భీమవరం: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని జూలై 4న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించే అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకుంది.పట్టణంలోని 34వ వార్డు ఏఎస్‌ఆర్‌ నగర్‌లోని మునిసిపల్‌ పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.దాదాపు రూ.3 కోట్లతో 15 టన్నుల బరువు గల అల్లూరి విగ్రహాన్ని పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు సహకారంతో తయారు చేయించారు.అల్లూరి విగ్రహాన్ని ఎత్తులో నిర్మించిన కాంక్రీట్‌ దిమ్మెపై నిలబెట్టారు.విగ్రహం ఆవిష్కరణ నాటికి పార్క్‌ను అందంగా తీర్చిదిద్దడానికి క్షత్రియ పరిషత్‌ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.

 Statue Of Alluri Kansya Reaching Bhimavaram , Statue Of Alluri Kansya , Bhimava-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube