తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా డాక్టర్ కె.లక్ష్మణ్ ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో భొలక్ పూర్ కషిష్ ఫంక్షన్ హాల్ లో డాక్టర్ లక్ష్మణ్ కు అభినందన సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కే లక్ష్మణ్ తో పాటు బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లూ ఇంద్రసేనారెడ్డి, కార్పొరేటర్లు పాల్గొని ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని ఎవరు నిరాశ చెందవద్దని పార్టీ పట్టిసీత కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు ఎప్పటికప్పుడు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.