రానా, సాయి పల్లవి లీడ్ రోల్ లో వేణు ఊడుగుల డైరక్షన్ లో వస్తున్న సినిమా విరాటపర్వం.శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై బజ్ బాగానే ఉంది.
లేడీ పవర్ స్టార్ ట్యాగ్ తో సాయి పల్లవి చేసిన ఈ సినిమాకు ఆమె ఫ్యాన్స్ సూపర్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.అయితే సాయి పల్లవి ఫ్యాన్ బేస్ క్రౌడ్ ఫుల్లర్ అవుతుందా లేదా అన్నది రేపు థియేటర్ లో తెలుస్తుంది.
ఇదిలాఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్ బయటకు వచ్చాయి.సినిమాకు 10 కోట్ల లోపే పూర్తి చేయగా సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో 10.5 కోట్ల ఇజినెస్ చేసిందట.ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 15 కోట్ల లోపే విరాటపర్వం సినిమా బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.
సో సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే 15 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.రానా కన్నా సినిమాలో సాయి పల్లవి హైలెట్ అవుతుందని.రానా జస్ట్ ఒక పాత్ర మాత్రమే చేశాడు అన్నట్టుగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు.ఇప్పటికే సినిమాపై పాజిటివిటీ రాగా సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్.