ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా మంది సెలబ్రిటీలుగా మారిపోయారు.ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిన వారు ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుని ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా గడపగా మరికొందరు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇలాంటి వారిలో నిహారిక ఒకరు.ఈమె యూట్యూబ్ వీడియోలు ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వార ఎంతో ఫేమస్ అయ్యారు.
ఎంతగా అంటే ఏకంగా స్టార్ హీరోలు సైతం వీరి సినిమా విడుదల సమయంలో ఈమెతో కలిసి ఇంటర్వ్యూ చేయడం, లేదంటే తనతో కలిసి సరదాగా రీల్స్ చేస్తూ సినిమాలను ప్రమోషన్ చేసుకుని పాపులారిటీని నిహారిక సొంతం చేసుకున్నారు.
తాజాగా మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన మేజర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ బాబు సైతం నిహారికతో ఒక వీడియో చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈ విధంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నిహారిక నిత్యం ఏదో ఒక వీడియో ద్వారా అభిమానులను సందడి చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ రీల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందులో ఈమె దేవుని ప్రార్థిస్తూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను ఒంటరిగా ఉన్నాను నా కోసం ఎవరైనా ఒక అబ్బాయిని పంపించి దేవుడా అని ప్రార్థించగా వెంటనే వెనుక హీరో సిద్ధార్థ్ ప్రత్యక్షమవుతాడు.
ఇలా దేవుడు తన కోసమే సిద్ధార్థ్ ను పంపించాడని ఈమె ఊహించుకొని అతనితో రొమాంటిక్ సాంగ్ వేసుకుంటుంది.ఇక చివరికి సిద్ధార్థ్ టైమెంతయింది సిస్టర్ అంటూ పిలవడంతో నిహారిక గుండె ఒక్కసారిగా ముక్కలైంది.సిద్ధార్థ ఈ విధంగా తనని సిస్టర్ అని పిలువగానే ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏమన్నారు అని అడుగుతుంది.
టైమ్ ఎంత అని అడిగాను అంటే ఆ తరువాత ఏమని పిలిచారు అనగా సిస్టర్ అని పిలిచానని సిద్ధార్థ్ చెబుతాడు.ఇక పోతే నా దగ్గర వాచ్ లేదంటూ నిహారిక చెప్పగా నా దగ్గర ఉంది కదా అంటూ అక్కడి నుంచి సిద్ధార్థ వెళ్ళిపోగా ఇతనికి నేను సిస్టర్ లాగా కనపడుతున్నానా అంటూ తెగ ఫీల్ అవుతుంది.
ఏది ఏమైనా నిహారిక ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇకపోతే నిహారికకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని ఈమె నిత్యం ఏదో ఒక వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ముఖ్యంగా స్టార్ హీరోలతో ఇంటర్వ్యూ చేస్తూ వారితో కలిసి ఇలా రీల్స్, వీడియోలు చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.