ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గురించి అందరికీ తెలిసిందే.ఈ కామర్స్, ఐటీ రంగంలో ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తోంది.
టెక్నాలజీ సర్వీసులను అందిస్తున్న అమెజాన్.తాజాగా విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది.
మెషిన్ లెర్నింగ్(ML)కోర్సుపై విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనుంది.దీని కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
విద్యార్థులకు మాత్రమే ఈ ఉచిత శిక్షణ అవకాశం కల్పించింది.ఉద్యోగాలు చేసేవారికి, చదువు పూర్తిచేసివారికి అవకాశం లేదు.
విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు మెషిన్ లెర్నింగ్ సమ్మర్ స్కూల్ ను ఆన్ లైన్ వేదికగా అమెజాన్ ప్రారంభించింది.ఇప్పటికే మొదటి బ్యాచ్ పూర్తవ్వగా.
ప్రస్తుతం రెండో బ్యాచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.అమెజాన్ లో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్తలు కోర్సును బోధించనున్నారు.
జూన్ 6న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా.జూన్ 18తో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది.
జూన్ 18న ఆన్ లైన్ ద్వారా ఎంట్రన్ టెసస్ట్ నిర్వహించనుంది.ఎంపికైన విద్యార్థులకు జూన్ 23న సమాచారం అందించనున్నారు.వచ్చే నెల 2వ తేదీ నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.
అర్హతలు
-ప్రస్తుతం చదువుతూ 2023,2024లో BE,ME,BTECH,MTECH,PHD పూర్తి చేయబోయే విద్యార్ధులు అమెజాన్ ఇవ్వబోయే ఉచిత ట్రైనింగ్ కోర్సుకు అర్హులు -ఉచిత ట్రైనింగ్ కోసం అమెజాన్ నిర్వహించే సెలక్షన్ టెస్ట్ పాస్ అవ్వాలి -భారతీయ పౌరులు అయి ఉండాలి
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
అమెజాన్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.అనంతరం మెషిన్ లెర్నింగ్ పై జూన్ 16న జరగనున్న లీడర్ షిప్ టాక్ వినాలి.తర్వాత ఆన్ లైన్ సెలక్షన్ టెస్ట్ కు అటెండ్ అవ్వాలి.
ఆన్ లైన్ క్లాసుల్లో అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది.ఈ సమయంలో మీ డౌట్స్ ను నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు.