యూనివర్సల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు కమల్ హాసన్.ఈయన తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తాడు.అయితే ఈయన హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది.అయినా కూడా కమల్ హాసన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.ఈయన సినిమాలు విభిన్నంగా ఉంటాయి.కమర్షియల్ హిట్ సాధించాక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు.
ఈ క్రమంలోనే తాజాగా కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్‘ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు.
ఈయన కూడా తన సినిమాలను విభిన్నంగా తెరకెక్కిస్తుంటాడు.ఈ క్రమంలోనే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు.ఈ ముగ్గురు కలయికలో సినిమా రావడంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా మరొక రెండు రోజుల్లో రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో నేపథ్యంలో మేకర్స్ మరింత ఫాస్ట్ గా ప్రొమోషన్స్ చేస్తున్నారు.ఇక తెలుగులో కూడా ప్రొమోషన్స్ చేస్తూ ఈ సినిమాను ప్రజలకు దగ్గర చేస్తున్నారు.
నిన్న రాత్రి గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.దీనికి వెంకటేష్, నితిన్ గెస్టులుగా హాజరయ్యారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.ఇప్పటి వరకు ఈ సినిమాలో నటిస్తున్న సూర్య పోస్టర్ ఒక్కటి కూడా రాలేదు.
తాజాగా ఈ సినిమా నుండి డైరెక్టర్ సూర్య పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో సూర్య బ్యాక్ సైడ్ నుండి వెనక్కి చూస్తున్న ఫోటో తో ఈ పోస్టర్ ఉంది.

ఇక ఈ లుక్ లో పూర్తిగా సూర్య కనిపించక పోయిన ఆయన లుక్ మాత్రం పవర్ ఫుల్ గా ఉంది.ఈయన ఈ పోస్టర్ పోస్ట్ చేస్తూ సూర్య ఈ సినిమాలో నటించినందుకు థాంక్స్ చెప్పుకొచ్చాడు.మరి చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా రిజల్ట్ తెలియాలంటే మరొక రెండు రోజులు వేచి ఉండాల్సిందే.