వైరల్: వామ్మో! మనిషిని వేటాడిన కంగారుని చూశారా? దాదాపు యుద్ధమే జరిగింది!

అడవి జంతువులలో కంగారు అనేది ఓ సాధు జంతువు.ఇది పూర్తిగా శాఖాహారి జీవి.

 Viral Video Man Attacked By Kangaroo Details, Kangroo, Viral Latest, News Viral-TeluguStop.com

కేంగరూ అనే ఆంగ్లం నుండి ఈ పేరు దానికి పెట్టారు మన శాస్త్రవేత్తలు.ఇది మార్సుపీలియాకు చెందిన క్షీరదము.

ఇందులో ముఖ్యంగా ఆడజీవులు శిశుకోశాన్ని (మార్సూపియం) కలిగి ఉంటాయి.అందువలన ఇవి వీటి పిల్లలను అందులో పెట్టుకొని సంరక్షిస్తూ ఉంటాయి.

కొన్ని మైళ్ళ దారం వాటి పిల్లలను ఇవి సునాయాసంగా ఆహారంకోసం పరుగెత్తుకొని వెళ్లగలవు.ముఖ్యంగా ఇవి ఆస్ట్రేలియా, టాస్మేనియా, న్యూగినియా దేశాలలో విస్తరించి ఉన్నాయి.

తోక పొడవుగా వున్నందువలన తోకను కంగారూ యొక్క ఐదవ కాలుగా పేర్కొంటారు.ఇంతకీ ఈ విషయం ఇక్కడ ఎందుకు ప్రస్తావించమంటే…

బేసిగ్గా ఇవి ఇతర జీవుల మీద దాడి చేయవు.

అంత అవసరం కూడా వీటికి లేదు.ఎందుకు అంటే పైన చెప్పిన విధంగా ఇవి పూర్తిగా శాఖాహార జీవులు.

అలాంటిది ఇవి మనుషుల పైన దాడి చేస్తాయంటే ఓ పట్టాన నమ్మబుద్ధి కాదు.కానీ ఇది నిజం.

అవును.ఓ కంగారు ఇక్కడ వీడియోలో పరిగెత్తుకుంటూ వచ్చి ఓ వ్యక్తిపై దాడి చేసినట్టు మనం స్పష్టంగా గమనించవచ్చు.

అతడు దాన్నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం కాస్త భయానకంగా కనిపిస్తోంది చూడండి.కంగారు అతడు దాదాపు 6 నిమిషాలకు పైగా వీరోచితంగా పోరాటం చేయడం చూడవచ్చు.

ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ దృశ్యాలు చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే, హీత్‌కోట్‌ ప్రాంతానికి చెందిన క్లిఫ్ డెస్ అనే వ్యక్తి తన పెరట్లో కుక్కలు గట్టిగట్టిగా అరవగా వెళ్లి చూశాడు.వెంటనే ఏం జరిగి ఉంటుందని అటుగా వెళ్లి చూడగా వారి పెరట్లోంచి ఓ పెద్ద జంతువు తనపైకి పరిగెత్తుకొస్తున్నట్టుగా గమనించాడు.

వెంటనే అప్రమత్తమై పారిపోయే ప్రయత్నం చేశాడు.అంతలోనే ఆ జంతువు అతగాడిపైన దాడి చేసింది.అదృష్టవశాత్తు అతనికి ఏమి కాలేదు.సదరు వీడియోని ఓ వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టగా ఇప్పటికి సుమారుగా 35000 మంది వీక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube