కొన్ని కథలు కొందరు హీరోలకు మాత్రమే సూట్ అవుతాయి.ఆ కథలలో వేరే హీరోలు నటించినా ప్రేక్షకులు అంగీకరించరు.
చిరంజీవి హీరోగా తెరకెక్కిన డాడీ సినిమా విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది.డాడీ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నా చిరంజీవి ఇమేజ్ కు తగిన కథ కాదని కామెంట్లు వినిపించాయి.2001 సంవత్సరంలో సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన డాడీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
రచయిత భూపతి రాజా డాడీ కథను నాకు వినిపించారని అయితే కథ నచ్చినా ఈ కథ నా కంటే వెంకటేష్ హీరోగా నటిస్తే బాగుంటుందని అనిపించిందని చిరంజీవి ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.
రైటర్ భూపతి రాజాకు సైతం తాను అదే విషయాన్ని చెప్పానని ఆయన అన్నారు.భూపతి రాజా మాత్రం వెంకటేష్ ఈ సినిమాలో నటిస్తే సాధారణ కథలా ఉంటుందని మీకు అయితే వెరైటీగా ఉంటుందని చెప్పి తనను ఒప్పించారని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఈ కథ విన్న మిగతా వాళ్లు కూడా చిన్న పిల్లతో ఈ సినిమా మీకు బాగుంటుందని చెప్పారని చిరంజీవి అన్నారు.బలవంతంగా ఆ సినిమాలో తాను నటించగా సినిమా ఫలితం కూడా అదే విధంగా వచ్చిందని చిరంజీవి చెప్పుకొచ్చారు.
కథ విన్న సమయంలో తాను ఏమని అనుకున్నానో అదే జరిగిందని సినిమా రిలీజైన తర్వాత డాడీ సినిమా చూసి వెంకటేష్ తనకు కాల్ చేశారని చిరంజీవి చెప్పుకొచ్చారు.
డాడీ భలే మూవీ అని నా మీద అయితే ఇంకా ఆడేదని వెంకటేష్ చెప్పాడని ఆ సమయంలో తాను వెంకటేష్ తో నీకైతే బాగుంటుందని నేను కూడా చెప్పానని కానీ వినలేదని చిరంజీవి ఫోన్ లో చెప్పుకొచ్చారు.అలా ఫ్లాపైన సినిమాలు తన లైఫ్ లో ఉన్నాయని చిరంజీవి కామెంట్లు చేశారు.చిరంజీవి అభిమానులు సైతం చిరంజీవి చెప్పిన మాటలు నిజమేనని భావిస్తున్నారు.