బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం గతవారం గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ కార్యక్రమంలో మహిళ విజేతగా బిందుమాధవి చరిత్ర సృష్టించింది.
ఇక హౌస్ లో ఉన్నన్ని రోజులు బిందుమాధవిని చాలామంది కంటెస్టెంట్ లు టార్గెట్ చేస్తూ వచ్చారు.ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ చివరి వారంలో బిందుమాధవి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తన పెంపకం గురించి తన తండ్రి పై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఈ విధంగా బిందుమాధవి పెంపకం గురించి తన తండ్రి ప్రస్తావన తీసుకురావడంతో చాలామంది నెటిజన్స్ నటరాజ్ మాస్టర్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఫైనల్స్ కి వెళ్లాల్సిన నట రాజ్ మాస్టర్ చివరి వారంలో ఎలిమినేట్ అయ్యారు.
ఇక ఎలిమినేట్ అయిన తర్వాత నట రాజ్ మాస్టర్ బిందుమాధవి గురించి ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు.బిందు మాధవి బయట తన పిఆర్ టీం వల్లనే ఇప్పటివరకు దొంగ ఓట్లతో బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతుందని, తను గెలిచిన దొంగ ఓట్లతోనే గెలుస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విధంగా నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు బిందుమాధవి గురించి చేసిన వ్యాఖ్యలపై బిందు మాధవి తండ్రి స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిందు మాధవి ఫ్యామిలీ ఆడియెన్స్ ను సంపాదించుకుంది.అందుకే తాను విజేతగా నిలబడిందని వెల్లడించారు.అందరూ మాట్లాడుతున్నట్టుగా తను డబ్బులు ఇచ్చి ఎలాంటి పి ఆర్ టీం మెయింటెన్ చేయలేదని నటరాజ్ మాస్టర్ మాటలను తప్పుబట్టారు.
ఇక నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడుతూ ఆయన ఏంటో ఈ ప్రపంచం మొత్తం చూసింది.బిగ్ బాస్ ఫినాలేకి వెళ్ళినప్పుడు నటరాజ్ మాస్టర్ తన వద్దకు వచ్చి తాను తప్పు చేశానని,నేను తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అంటూ క్షమాపణలు కోరారని ఈ సందర్భంగా బిందుమాధవి తండ్రి తెలిపారు.
నటరాజ్ మాస్టర్ బిందు గురించి మాట్లాడిన మాటలలో ఏది నిజం లేదని, అవన్నీ అవాస్తవలేనని తెలియజేశారు.