నిందితులంతా పెద్దల సభలోనే ఉన్నారు.. వైసీపీపై ప్రతిపక్షాల సెటైర్లు

ఏపీలో రాజ్యసభ సీట్లు ఖాళీ కావడంతో తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డికి జగన్ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.అయితే నిరంజన్ రెడ్డి ఎవరో కాదు జగన్ అక్రమాస్తుల కేసును వాదిస్తున్న లాయర్.

 All The Accused Persons Are In Rajya Sabha Opposition Parties Satires On Ycp ,-TeluguStop.com

జగన్ వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు.దీంతో ఆయన తరఫున న్యాయవాదిగా నిరంజన్‌రెడ్డి సేవలు అందిస్తున్నారు.

అందుకే నిరంజన్ రెడ్డి రుణం తీర్చుకోవాలని ఏపీ సీఎం జగన్ భావించగా ఇప్పుడు పెద్దల సభకు పంపారన్న టాక్ నడుస్తోంది.అయితే వైసీపీ తరఫున పెద్దల సభకు వెళ్లిన వారిలో చాలా మంది జగన్‌కు సంబంధించిన కేసుల్లో నిందితులుగా లేదా కేసులు వాదిస్తున్న వారిగా ఉన్నారంటూ ప్రతిపక్ష పార్టీ జనసేన సెటైర్లు వేస్తోంది.

ఇప్పటివరకు నిందితులనే వైసీపీ పెద్దల సభకు పంపగా ఇప్పుడు లాయర్‌ను కూడా పంపడం అంటూ వ్యంగ్యాస్త్రాలను సంధించింది.

ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులలో విజయసాయిరెడ్డి, పార్థసారథిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ ఉన్నట్లు జనసేన నేతలు విమర్శలు చేస్తున్నారు.

వీరిలో పలువురు తమకు తెలిసో.తెలియకుండానో జగన్ కేసుల్లో ఇరుక్కుపోయారని.

గతంలో వైఎస్ఆర్ చెప్పారని ఫైళ్ల మీద సంతకాలు చేసి అష్టకష్టాలు పడ్డారని.అయితే ఇప్పుడు పెద్దల సభకు వెళ్లి దర్పం ప్రదర్శిస్తున్నారని జనసేన నేతలు సెటైర్లు వేస్తున్నారు.

Telugu Janasena, Hasarathy, Rajya Sabha, Telugu Desam, Vijayasai, Ysrcp-Telugu P

మరోవైపు టీడీపీ కూడా ఈ అంశాన్ని వదిలిపెట్టడం లేదు.చంద్రబాబు సులువుగా వ్యవస్థలు మేనేజ్ చేస్తారని వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తారని.ఇప్పుడు న్యాయవ్యవస్థను కాపాడాల్సిన వ్యక్తి ఓ రాజకీయ పార్టీ తరఫున పెద్దల సభకు వెళ్తున్నారంటే.ఎవరు వ్యవస్థలను మేనేజ్ చేస్తారో స్పష్టంగా తెలిసిపోతోందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఆరోజు సూట్ కేసు కంపెనీలలో చాలా భాగం జగన్ జేబు సంస్థలవే అని తాము విమర్శిస్తే వైసీపీ నేతలు ఎదురుదాడి చేశారని కౌంటర్లు ఇస్తున్నారు.ఏదేమైనా ఈరోజు జగన్ ఫ్రెండ్స్ అంతా పెద్దల సభలో కొలువుదీరడం ఏపీకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చదని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube