సూర్యాపేట జిల్లా:ఆటో,లారీ,క్యాబ్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు రవాణా సేఫ్టీ బిల్లును,ఫిట్ నెస్ రెన్యూవల్ ఫెనాల్టీని రూ.50 పెంచి భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా తలపెట్టిన రవాణా బంద్ లో భాగంగానే గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ కెవి, ఐఎన్టీయూసీ,సిఐటియు,ఐఎఫ్ టియు,ఇఫ్టూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి,సూర్యాపేట ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.ఆటో, లారీ,ఇతర వాహన కార్మికులు స్వచందగా బంద్ నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మోటారు రంగ కార్మికులకు రోడ్డు రవాణా సేఫ్టీ బిల్లు 2019 తెచ్చి ఉరితాడుగా అమర్చారని విమర్శించారు.
కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా రోడ్డు రవాణా బిల్లును మార్చి రవాణా రంగాన్ని వారికి అప్పగించుటకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.పెట్రోల్,డీజిల్,గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ కార్మిక వర్గాన్ని నష్ట పరుస్తున్నారని ఆవేదన వ్యక్త చేశారు.
ప్రమాదాలు జరిగినప్పుడు ఇంటికి పెద్ద దిక్కైన డ్రైవర్ చనిపోవడంతో కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయని,అందుకే మోటార్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని,714 జీవో మోటారు రంగ కార్మికులను నడ్డి విరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.మోటారు రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయం చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ కెవి జిల్లా అధ్యక్షులు వెంపటి గురూజీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు,ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు కొండపల్లి సాగర్ రెడ్డి,ఐఎఫ్ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య,ఐఎఫ్టీయూ నాయకులు రాములు నాయకత్వం వహించగా,ఐఎన్టియుసి జిల్లా నాయకులు ఆలేటి మాణిక్యం,సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.శేఖర్,టిఆర్ఎస్ కెవి ఆటో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కర్రీ సైదులు,ఎస్కె హమ్మద్,ఐఎఫ్ టియు ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి గుంటి మురళి, టీఆర్ఎస్ కెవి పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఖుషి వెంకన్న,జిల్లా ఉప అధ్యక్షులు తండు శ్రీనివాస్,పట్టణ ఉప అధ్యక్షులు ఎస్.భిక్షం,పట్టణ కోశాధికారి దాసరి రాంబాబు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి.హైమాద్,జిల్లా సహాయ కార్యదర్శులు మాక్బూల్,రాము,సోమేశ్,మునీర్,పాషా,ఐఎఫ్ టీయూ ఆటో యూనియన్ టౌన్ అధ్యక్షులు ఎండి నజిరుద్దీన్,ఇఫ్టూ నాయకులు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.