ఐఎస్ఐ మార్కు ఉన్న వ‌స్తువుల‌నే వినియోగించండి

సూర్యాపేట జిల్లా:వినియోగదారులకు ఐఎస్ఐ మార్క్ ఉన్న వస్తువులపై అవగాహన కల్పించాలని ఆదనవు కలెక్టర్ ఎస్.మోహన్ రావు అన్నారు.

 Use Only Isi Branded Items-TeluguStop.com

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినియోగదారులు ఐఎస్ఐ హాల్ మార్క్ గల వస్తువుల వినియోగంపై బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ శాస్త్రవేత్త‌లు,జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భారతీయ ప్రమాణాల సంస్థ జాయింట్ డైరెక్టర్ శివప్రసాద్ తో కలసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐఎస్ఐ మార్కు ఉన్న వ‌స్తువుల‌ను మాత్ర‌మే ప్రజలు కొనుగోలు చేసే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు.

వినియోగించాల‌ని,ప్ర‌జ‌ల‌కూ ఈ విష‌యంలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని,జిల్లాలోని అన్ని విభాగాల అధికారులకు వస్తువుల నాణ్య‌త‌ ప్ర‌మాణాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు.అనంతరం జిడి శివప్రసాద్ మాట్లాడుతూ ఐఎస్ఐ మార్కు ఉన్న వ‌స్తువుల నాణ్య‌త‌ను బీఐఎస్ ప‌రిశ్ర‌మ‌లు,బ‌హిరంగ మార్కెట్‌ నుంచి సేక‌రించిన న‌మూనాలను ప‌రీక్షించ‌డం ద్వారా ఆ వ‌స్తువుల యొక్క నాణ్య‌త‌ను ప‌ర్యవేక్షిస్తోంద‌ని తెలిపారు.

బీఐఎస్ కేర్ యాప్‌ను ఉప‌యోగించ‌డం ద్వారా ఐఎస్ఐ మార్కు ఉన్న వ‌స్తువుల లైసెన్సు, త‌యారీదారుల వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌న్నారు.అనంత‌రం శాస్త్రవేత్త అవినాష్ బాబు హాల్ మార్కింగ్ గురించి అధికారుల‌కు వివ‌రించారు.

బంగారు ఆభ‌ర‌ణాలపైన ఉన్న హెచ్‌యూఐడీ నెంబ‌రు బీఐఎస్ కేర్‌లో ఉప‌యోగించ‌డం ద్వారా వాటి విశ్వ‌స‌నీయ‌త‌ను తెలుసుకోవ‌చ్చున‌ని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఈఈ ఆర్ అండ్ బి యాకుబ్,ఏడీఏ రామారావు నాయక్, డి.ఎస్.ఓ విజయలక్ష్మి,సంక్షేమ అధికారులు శంకర్,జ్యోతిపద్మ,అనసూర్య,దయానందరాణి, డిఎం అండ్ హెచ్ ఓ డా.కోటా చలం,స్టాండ‌ర్డ్ ప్రమోటింగ్ అధికారి అభిసాయి,ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube