వార్నింగ్ లేనా యాక్షన్ లోకి దిగుతారా ? రాహుల్ నిర్ణయంపై కాంగ్రెస్ లో ఉత్కంఠ ?

మొత్తానికి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు తెలంగాణలో ఉన్నారు.పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగే విధంగా  చేయగలిగారు.

 Rahul Gandhi Is Going To Take Stern Action Against Those Who Act Beyond Party Di-TeluguStop.com

వరంగల్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో  డిక్లరేషన్ ను ఆయన ప్రకటించారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తుందనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు.

మొత్తంగా కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ ఉత్సాహం నింపే విధంగానే రెండు రోజులపాటు కృషి చేశారు.ఈ సందర్భంగా కొంతమంది పార్టీ సీనియర్ నాయకులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.

అంతర్గత కుమ్ములాటలతోనే కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోతోందని, సొంత పార్టీ లోనే  విపక్షం ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.పార్టీ గీత దాటి ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ సైతం రాహుల్ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీని ఓడించేది కాంగ్రెస్ మాత్రమే అనే అభిప్రాయం ప్రజల్లో.తలెత్తకుండా చూసుకోవాలని సూచన చేశారు.

ఇంత వరకు బాగానే ఉన్నా .తెలంగాణ సీనియర్ నాయకులు మధ్య తరచుగా గ్రూపు రాజకీయాలు ఏర్పడడం ఒకరి నాయకత్వం ను మరొకరు అంగీకరించక పోవడం వంటి వ్యవహారాలు ఎప్పటి నుంచో చోటుచేసుకుంటున్నా … ఎప్పటికప్పుడు ఈ విషయాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారిస్తున్నా, చిన్నచిన్న వార్నింగ్ లతో సరిపెట్టేస్తూ ఉండడంతో ఎప్పటికప్పుడు ఈ వ్యవహారం షరా మామూలుగానే మారిపోయింది.తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొంత మంది టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు అనుకూలంగా వ్యవహరిస్తు ఉండడం వంటివన్నీ కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారుతున్నా, అటువంటి నాయకుల పై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సాహసం చేయలేకపోతోంది.
 

Telugu Aicc, Congress, Jagga, Komativenkat, Rahul Gandhi, Revanth Reddy-Telugu P

అయితే ఇదే పరిస్థితి ఎప్పుడూ కొనసాగదని,  ఇకపై పార్టీ గీత దాటి వ్యవహరించిన వారందరి పైన కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్లు అయినా ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ రాహుల్ పార్టీ నాయకుల సమావేశంలో ప్రస్తావించడంతో,  రాహుల్ ముందు ముందు తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది.తెలంగాణలో రాహుల్ టూర్ సక్సెస్ చేయడంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటు, రేవంత్ రెడ్డి వంటివారు ప్రయత్నాలు ఫలించాయి.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ విషయంలో రాహుల్ గాంధీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది నాయకులకు ఉత్కంఠ కలిగిస్తోంది.

     

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube