ఈ మధ్య కాలంలో పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం కంటే ఫ్రైడ్ ఫుడ్ తినడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.మరి ముఖ్యంగా ఫ్రైడ్ చికెన్ అంటే జనాలు చెవి కోసుకుంటున్నారు.
ప్రజల యొక్క టేస్ట్ ను గమనించిన రెస్టారెంట్ నిర్వహకులు కూడా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను తయారు చేస్తున్నారు.ఏది కావాలన్నా సరే ఎంచక్కా ఇంట్లోనే ఉండి ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు నిమిషాల్లో ఇంటికి ఆర్డర్ తెచ్చి మరి ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక మహిళ చికెన్ పిసెస్ ఆర్డర్ చేయగా అందులో తక్కువ ముక్కలు వచ్చాయని ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేసింది.అక్కడితో ఆగకుండా ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త రచ్చ రచ్చ అయింది.
సాధారణంగా ఫుడ్ డెలివరీ ఇచ్చే సమయంలో హడావుడిగా ఒకళ్ళకి ఇవ్వవలిసిన ఆర్డర్ మరొకరికి ఇవ్వడం, లేదంటే ఆర్డర్ చేసిన ఫుడ్ కాకుండా వేరోక ఫుడ్ డెలివరీ చేయడం లాంటి పోరపాట్లు జరుగుతూనే ఉంటాయి.సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది.
అసలు వివరాల్లోకి వెళితే.యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని క్లీవ్ ల్యాండ్‌కు చెందిన ఒక మహిళ కేఎఫ్‌సీ లో ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసింది.ఆర్డర్ ను స్వికరించిన రెస్టారెంట్ వాళ్ళు సదరు మహిళ ఆర్డర్ చేసిన చికెన్ పీసెస్ ను డెలివరీ బాయ్ ఆమె ఇంటికి తీసుకుని వచ్చి ఇచ్చాడు.ఇంటికి వచ్చిన ఆ ఆర్డర్ ను ఓపెన్ చేసి చూడగా తక్కువ చికెన్ పీసెస్ ఉన్నాయి.
తాను 8 చికెన్ పీసెస్ కోసం ఆర్డర్ చేస్తే కేవలం 4 పీసెస్ మాత్రమే డెలివరీ ఇచ్చారంటు సదరు మహిళ కోపంతో డైరెక్ట్ గా పోలీస్ కంప్లైట్ నెంబర్ 911 కి కాల్ చేసి ఫాస్ట్ చైన్ కేఎఫ్‌సీ పై కంప్లీట్ ఇచ్చింది.ఈ ఫిర్యాదుపై సదరు మహిళ వాదనను విన్న పోలీసులు ఆమె ఫిర్యాదపై ఎలాంటి సహాయం చేయలేమంటూ బదులివ్వడం జరిగింది.

ఎందుకంటే ఇది సివిల్ విషయం అని, క్రిమినల్ విషయం కాదని పోలీసులు ఆమెకు వివరించారట.మీకు ఈ కేసులో న్యాయం జరగాలంటే రెస్టారెంట్ వాళ్ళని సంప్రదించాలంటూ సలహా కూడా ఇచ్చారట.ఇంకెప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఫోన్స్ చేసి తమ విలువైన సమయాన్ని వృథా చేయొద్దని సదరు మహిళను హెచ్చరించారట పోలీసులు.ఈ విషయం కాస్త సోషల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.
చికెన్ ముక్కలు తక్కువ వచ్చాయని పోలీసులు ఫిర్యాదు చేయడం ఏంటని కొందరు నేటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.