కశ్మీర్ లో సమంత.. ఇప్పుడు అక్కడ ఏం చేస్తుందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Samantha Heads Kashmir Vijay Devarakonda Siva Nirvana Film , Samantha , Vijay De-TeluguStop.com

ఒక సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస సినీ అవకాశాలతో దూసుకుపోతుంది.ఇటీవలే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కు స్టెప్పులు ఇరగదీసిన సమంత ఈ సినిమా తరువాత సమంత క్రేజ్ మరింత పెరగడమే కాకుండా,వరుసగా ఆఫర్లు వచ్చి చేరుతున్నాయి.

ఇకపోతే సమంత తమిళంలో నటించిన కాతువాకుల రెండు కాదల్ సినిమా విడుదల కు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

తెలుగులో ఇప్పటికే యశోద, శాకుంతలం షూటింగ్స్‌ కంప్లీట్‌ చేసిన సమంత తాజాగా శివ నిర్వాణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు.ఇటీవలె ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కశ్మీర్‌లో జరగనుంది.దీనికి సంబంధించిన ఫోటోలను సామ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది.ఫ్లయిట్‌లో వెళ్తూ కశ్మీర్‌ అందాలను కెమెరాలో బంధించింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Kashmir, Samantha, Siva Nirvana, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే సమంతా గత ఏడాది నాగ చైతన్య తో విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే.విడాకులు తీసుకున్న తర్వాత సమంత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టింది.అంతేకాకుండా విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తూ నిత్యం ఏదో రకమైన కొటేషన్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.విడాకుల తర్వాత సమంతా సోషల్ మీడియా లో ఎటువంటి పోస్ట్ చేసినా కూడా అది క్షణాల్లో మొదలవుతూ ఉంటుంది.

నాగచైతన్య కూడా ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube