సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరో హీరోయిన్ల మధ్య మాత్రమే కాదు అప్పుడప్పుడు దర్శకుల మధ్య వివాదాలు కొనసాగుతు ఉంటాయి.ఇలా దర్శకుల మధ్య ఉండే చిన్నపాటి గొడవలు అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.
ఇలాగే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న బోయపాటి శ్రీను కొరటాల శివ దర్శకుల మధ్య ఎప్పటి నుంచొ వివాదం కొనసాగుతూ వస్తుంది అన్న ట్రాక్ ఉంది.ఇక ఇద్దరి దర్శకత్వంలో ఇప్పటివరకు ఎన్నో బంపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అయితే వీరిద్దరూ కూడా అటు నటుడు దర్శకుడు రచయిత నిర్మాత అయిన పోసాని కృష్ణమురళి బంధువులే కావడం గమనార్హం.అంతేకాదండోయ్ వీరిద్దరిలో కామన్ క్వాలిటీ ఏంటంటే ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు శిష్యరికం చేసింది కూడా పోసాని కృష్ణమురళి దగ్గరే కావడం గమనార్హం.
బోయపాటి ముత్యాల సుబ్బయ్య దగ్గర అసిస్టెంట్గా చేర్పించింది పోసాని కృష్ణ మురళి.బోయపాటి కంటే కొరటాల పోసానికి మరి ఇంత ఆత్మీయుడు అని చెప్పాలి.వీరిద్దరు కూడా మేనమామ మేనత్త కొడుకులు అవుతారు.కాగా ఇప్పుడు మాస్ హీరోగా ఎవరు ఎలివేట్ కావాలంటే అది బోయపాటితో సినిమా తోనే సాధ్యమని అనుకుంటారు హీరోలు.

ఇంకా ఎవరు సూపర్ హిట్ కొట్టాలంటే అది కేవలం కొరటాలశివ తోనే సాధ్యం అని భావిస్తూ ఉంటారు.అయితే కెరీర్ స్టార్టింగ్ లో కొరటాల బోయపాటి దగ్గర కొన్నాళ్లపాటు పని చేశారు.బాలయ్యతో బోయపాటి తీసిన సింహా సినిమా తర్వాత వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది.సింహ సినిమా కథ కథనం విషయంలో ఎంతో కీలకంగా ఉన్న తన పేరు వేయలేదు అంటూ కొరటాల ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని శ్రీమంతుడు సక్సెస్ తర్వాత బయట పెట్టాడు.దీనికి బోయపాటి కూడా కౌంటర్ ఇచ్చాడు.నా టీమ్ లో చాలా మంచి పని చేశారు.ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇచ్చారూ.
ఇక అందరి పేరు వేయలేం కదా అంటూ చెప్పుకొచ్చారు.అయితే తనకు సింహ సినిమా విషయంలో జరిగిన అవమానంతో ఒక గుణపాఠంగా భావించానని.
మనం నమ్మి మోసపోవడం మన తప్ప అంటూ చెప్పుకొచ్చారు.ఇలా ఇద్దరు స్టార్ దర్శకుల మధ్య ఎన్నో రోజుల నుంచి ఒక వివాదం కొనసాగుతూనే వస్తోంది.