బిగ్ బాస్ కార్యక్రమం నేటితో 8వ వారం పూర్తి చేసుకోనుంది.ఈ క్రమంలోనే ఈ వారం ఆరు మంది నామినేషన్ లో ఉండగా వారిలో బిందుమాధవిని బాబా భాస్కర్ మాస్టర్ సేవ్ చేశారు.
ఈ క్రమంలోనే అఖిల్, అజయ్, అషు రెడ్డి, అనిల్, హమీదా ఈ ఐదుగురు ఈ వారం నామినేషన్ లో ఉన్నారు.అయితే ఈ వారం హమీదా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళుతుంది అంటూ వార్తలు వచ్చాయి.కానీ ఊహించని విధంగా ఈ వారం బిగ్ బాస్ నుంచి కంటెస్టెంట్ అజయ్ ఎలిమినేట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
8వ వారం కేవలం ఐదు మంది కంటెస్టెంట్ లు మాత్రమే నామినేషన్ లో ఉండగా ఈవారం ఎలిమినేషన్ ఎంతో రసవత్తరంగా కొనసాగినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఓట్ల పరంగా అఖిల్, అనిల్ మొదటి రెండు స్థానాలలో ఉండగా, అషు రెడ్డి మూడవ స్థానం, హామీదా నాలుగవ స్థానంలో ఉన్నారు.ఇక చివరిగా అజయ్ కి ఓట్లు చాలా తక్కువగా రావడంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి అజయ్ బయటికి రానున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

అజయ్, అఖిల్ వీరందరు ఒకే గ్యాంగ్.ఇన్ని రోజులు అజయ్ ను వాడుకొని అఖిల్ చివరి ప్లేట్ మార్చి అజయ్ ను దారుణంగా మోసం చేశాడు.ఇక బిగ్ బాస్ నిర్వహించిన సేవ్ ట్యాగ్ టాస్క్ లో భాగంగా అఖిల్ అజయ్ కి కాకుండా మిత్రా శర్మకి సేవ్ టాగ్ ఇస్తూ అజయ్ ను దారుణంగా మోసం చేశాడు.ఇక నేడు అజయ్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రానున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మరికొన్ని గంటల పాటు వేచి ఉండాలి.