బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఎంతో ప్రేక్షకాదరణ పొంది దూసుకుపోతున్న ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న రోజా ఎంతో కీలకంగా ఉన్నారు.
అయితే రోజాకు మంత్రి పదవి రావడంతో ఈమె ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.ఇక ఈమె మంత్రి అయిన తర్వాత చివరిసారిగా జబర్దస్త్ కార్యక్రమానికి రావడంతో జబర్దస్త్ టీమ్ ఈమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.
తాజా ఎపిసోడ్ లో భాగంగా కమెడియన్స్ అందరూ కూడా రోజాతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ తనకు మల్లెమాల నుంచి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఉందో.
రోజా గారి నుంచి కూడా అలాంటి సపోర్ట్ తనకు లభించిందని,తిరిగి రోజా గారు ఈ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాను అంటూ సుధీర్ రోజా కాళ్ళపై పడి తన ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇక ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ రోజా మేడం గారే తనకు ఆటో రామ్ ప్రసాద్ అనే పేరు పెట్టారని గుర్తు చేసుకున్నారు.ఇక రోజా గారు ఇప్పుడు కూడా మీ అందం, స్మైల్ ఈ రెండింటినీ అలాగే మైంటైన్ చేయండి అంటూ ఆటో రాంప్రసాద్ చెప్పుకొచ్చారు.ఇక ఇంటి నుంచి అసెంబ్లీకి వెళ్ళిన రోజా గారు త్వరలోనే పార్లమెంటుకు కూడా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఆటో రాంప్రసాద్ రోజా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ఇక ఈ కార్యక్రమంలో కూడా రోజా మాట్లాడుతూ దేవుడి ఆశీస్సులు, నగరి ప్రజల ఆశీస్సులు కారణంగా తన కల నెరవేరిందని ఈ సందర్భంగా రోజా వెల్లడించారు.