ఒకప్పుడు లవ్ స్టోరీ లకు బ్రాండ్ అంబాసిడర్ అయిన తేజ ఈమద్య కాలంలో సినిమా లతో ఆకట్టుకోలేక పోతున్నాడు.అయినా కూడా ప్రయత్నాలు ఆపడం లేదు.
దశాబ్ద కాలంగా తేజ కు గట్టి కమర్షియల్ సక్సెప్ పడలేదు.మద్య లో రానా తో తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ఒక మోస్తరు సక్సెస్ ను దక్కించుకుంది.
ఆ తర్వాత తేజ నుండి పెద్దగా సినిమాలు రాలేదు.వచ్చినవి సోదిలో లేకుండా పోయాయి.
అయినా కూడా తేజ నుండి వరుస సినిమా ల ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.ఇటీవలే రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి తో అహింస అనే సినిమా ను చేస్తున్నాడు.
ఆ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది.ఈ సమయంలో ఈయన మరో సినిమా ను ప్రకటించాడు.
విక్రమాధిత్య అంటూ ఒక టైటిల్ ను అధికారికంగా ప్రకటించాడు.హీరో ఎవరు అనే విషయాన్ని తెలియజేయలేదు.
ఈ సినిమా ఎవరితో తెరకెక్కిస్తాడో తెలియదు కాని మీడియా వర్గాల వారు మాత్రం తేజ గతంలో ప్రకటించిన రెండు సినిమా ల గురించి ప్రశ్నిస్తున్నారు.తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత రెండు సినిమాల ప్రకటనలు వచ్చాయి.
అందులో మొదటిది రాక్షస రాజు రావణాసురుడు మరియు రెండవది అలిమేలుమంగ వెంకట రమణ.
ఈ రెండు సినిమా లకు సంబంధించిన హడావుడి ఆ మద్య తెగ కనిపించింది.అలిమేలు మంగ వెంకట రమణ సినిమా ను గోపీచంద్ తో రాక్షస రాజు రావణాసురుడు ను రానా తో తెరకెక్కించబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.కాని ఆ సినిమా ల గురించి ఆ తర్వాత ఎలాంటి ప్రకటన కూడా లేదు.
ఎన్నో సినిమాలు ఆయన నుండి ప్రకటన వస్తున్నాయి కాని సినిమాలు మాత్రం రావడం లేదు.మరి విక్రమాధిత్య అయినా వస్తుందా లేదా అనేది చూడాలి.