ఏపీ విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోపమెందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు..

ఏపీ విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోపమెందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీకి జరిగిన అన్యాయంపై కేసీఆర్ మాట్లాడాలని, బీజేపీని నిలదీసేందుకు ఏపీని కలుపుకోవాలని అన్నారు.

 Undavalli Arun Kumar Said That Telangana Chief Minister Kcr Is Angry Over Ap Ne-TeluguStop.com

ఏపీ విభజన నిబంధనల ప్రకారం జరిగిందని కేసీఆర్ ఒప్పుకుంటారా అని నిలదీశారు.ఎనిమిదేళ్ళ క్రితం లోక్‌సభలో ఏపీ విభజన బిల్లు ఆమోదం జరిగినట్టు ప్రకటించారని తెలిపారు.ఏపీ విభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రదాని మోదీ, అమిత్ షాలు పార్లమెంట్ ఉభయ సభల్లోనే చెప్పారన్నారు.

2013లోనే విభజనపై సుప్రీంకోర్టులో ఫిటీషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.మళ్ళీ సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాది అల్లంకి రమేష్ ద్వారా అర్జెంట్ పిటీషన్ దాఖలు చేశానన్నారు.ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లి చేతులు జోడించి వేడుకున్నారు.

పేపర్ మీద లోక్‌సభలో వైసీపీలతో చర్చ పెట్టించాలని డిమాండ్ చేశారు.విభజనపై ఇప్పటి కైనా ఏపీకి సంబంధించిన నేతలు స్పందించాలన్నారు.

ముఖ్య మంత్రి స్పందించి ఒక మెయిల్ ఏర్పాటు చేసి ఏపీ విభజనపై ప్రజల అభిప్రాయాలు సేకరించాలని తెలిపారు.చంద్రబాబు, జగన్‌లు కొట్టుకొని ఏపీకి అన్యాయం చేస్తారా అని మండిపడుతూ… కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నించరా అని ప్రశ్నించారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సీఎం జగన్ నోరుమెదపకపోవటం అన్యాయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు

.

Undavalli Arun Kumar Said That Telangana Chief Minister KCR Is Angry Over AP New Distcts, Undavalli Arun Kumar, Ap Poltics, Ts Poltics, Trs , Ycp , Chandra Babu , Tdp , Ys Jagan , Central Govt , Bjp - Telugu Ap Poltics, Central, Chandra Babu, Ts Poltics, Undavalliarun, Ys Jagan

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube