ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఏది పడితే అది చెయ్యకూడదు.. నటుడి కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోలు ఎంతోమంది ఉన్నారు.ఇలా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోలలో శివ కందుకూరి ఒకరు.

 You Have Family Background That It Should Not Do Anything Actor Comment -goes Vi-TeluguStop.com

ఈయన తండ్రి రాజ్ కందుకూరి ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే ఆ ఫ్యామిలీ నుంచి శివ కందుకూరి చూసి చూడంగానే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఇక ఈ సినిమా తరువాత ఈయన గమనం సినిమాలో నటించారు.

గమనం సినిమా ఈ హీరోకి ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

ఈ క్రమంలోనే నేడు నటుడు శివ కందుకూరి పుట్టినరోజు కావడంతో ఆయన మీడియాతో ముచ్చటిస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఏ పని చేసిన స్వచ్ఛంగా ఉండాలని భావిస్తానని కథకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటేనే అది చెయ్యటానికి ఒప్పుకుంటానని ఈ సందర్భంగా శివ కందుకూరి వెల్లడించారు.

ఇలా కథను ఎంపిక చేసుకునే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచించారు.ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా అని ఏది పడితే అది చేసుకుంటూ పోతే కెరియర్ ఇబ్బందులలో పడుతుందని ఈ సందర్భంగా శివ కందుకూరి వెల్లడించారు.ఇక ఈయన మనుచరిత్ర అనే మరో చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమానే కాకుండా పురుషోత్తమ్‌ రాజ్‌తో ఓ సినిమాతో పాటు నానీగారు నిర్మిస్తున్న ‘మీట్‌ క్యూట్‌’ వెబ్ ఫిల్మ్ లో నటిస్తున్నానని ఈ సినిమాతో పాటు మరో వెబ్ సిరీస్ కూడా చర్చలో ఉందని శివ కందుకూరి ఈ సందర్భంగా వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube