జేసీబీతో ఏనుగు ఫైటింగ్.. మరి గెలిచింది ఎవరు..?

జంతువులు సాధారణంగా చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాయి.అవి దాదాపుగా ఎవరికి హాని కలిగించవు.

 Elephant Fighting With Jcb And Who Won, Elephant Fighting , Viral Video , If Mi-TeluguStop.com

జంతువుల్లో జాలి, కురుణ ఎంత స్థాయిలో ఉంటాయో కోపం సైతం అంతే స్థాయిలో ఉంటుంది. కామన్ గా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి కానీ ఎవరైనా వాటితో తప్పుగా ప్రవర్తిస్తే ఇక వాటి కోపాన్ని ఆపడం ఎవరి తరం కాదు.

చివరికి కోసం వస్తే పిల్లి సైతం పులిగా మారుతుందని ఊరికే అనలేదు.మరి చిన్న జంతువులకు కోపం వస్తే వాటి నుంచి ఎలాగో అలా తప్పించుకోవచ్చు.

కానీ, పెద్ద జంతువులకు కోపం వస్తే ఎలా? వినడానికే భయమేస్తోంది కదా.మరి వాటిని లైవ్ లో చూసిన వారి పరిస్థితి ఏంటి? వారితో పోరాడిన వారి పరిస్థితి ఏంటి.తలుచుకుంటేనే గుండే ఝల్లుమంటోంది.ఒక ఏనుగుకు కోపం రావడంతో ఏకంగా జేసీబీ పైనే తన ప్రతాపాన్ని చూపించింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక గట్టు వద్ద జేసీబీ ఏదో పనిచేసుకుంటోంది.అక్కడికి ఉన్నట్టుండి ఒక ఏనుగు వచ్చింది.మరి దానికి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ.

ఏకంగా జేసీబీపైనే దాని ప్రతాపాన్ని చూపించేందుకు రంగంలోకి దిగింది.జేసీబీని తన తొండంతో వెనక్కి తోస్తూ దాని పడేసే ప్రయత్నం చేసింది.

అనంతరం అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయింది ఆ ఏనుగు.దీంతో ఆ జేసీబీని నడుపుతున్న డ్రైవర్ పరిస్థితి ఎలా ఉందో తలుచుకుంటేనే భయమేస్తోంది.

దాదాపుగా అతనికి కూడా భయంతో ఒళ్లంతా తడిసిపోయి ఉంటుంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనిని చూసిన నెటిజన్స్ ఏనుగుకు ఎందుకు కోసం వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి మీరు కూడా ఓ సారి ఆ వీడియోను చూసెయ్యండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube