చేతులు కాళ్లు లేకుండా ఈత కొడుతున్న వ్యక్తి వివరాలు తెలిస్తే షాక్..

మనం ఈత కొట్టేందుకు చేతులు, కాళ్లు తప్పనిసరిగా కావాలి.చేతులు కాళ్లను ఆడిస్తేనే మనం నీటిలో మునగకుండా ఉంటాం.

 Shock If You Know The Details Of A Person Swimming Without Arms And Legs , Swimm-TeluguStop.com

కానీ ఏపీకి చెందిన శివయ్య అనే వ్యక్తి మాత్రం చేతులు, కాళ్ల సాయం లేకుండానే నీటి మీద తేలుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.ఈ విషయం తెలిసిన చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు.

వామ్మో ఇదేం విచిత్రం అని అనుకుంటున్నారు.అసలు శివయ్య అలా ఎలా ఈత కొడుతున్నాడని అందరూ సందేహిస్తున్నారు.

ఇంతకీ శివయ్య ఏ ప్రాంతానికి చెందిన వాడంటే.

విశాఖలోని భీమిలి మండలం బసవ పాలెం గ్రామానికి చెందిన శివయ్యకు వెనకా ముందు ఎవరూ లేరు.

శివయ్య తన పేరుకు తగ్గట్లుగానే ఎల్లప్పుడూ శివనామస్మరణలోనే ఉంటుంటాడు. అటువంటి శివయ్య ఒక సారి 15 సంవత్సరాల క్రితం ఓ సారి స్నానానికని నదిలోకి దిగాడు.

నదిలోకి దిగిన శివయ్య అక్కడ జరిగింది చూసి ఒక్కసారి షాక్ అయ్యాడు.ఎటువంటి ఈత రాకపోయినా కానీ తన బాడీ నీటిమీద తేలడం గమనించాడు.

శివయ్య పుట్టుకతోనే పోలియో బారిన పడ్డాడు.దీంతో అతనికి ఒక చేయి పూర్తిగానే పోయింది.

ఇక మరో చేయికి రెండు వేళ్లు మాత్రమే ఉన్నాయి.కానీ శివయ్య మాత్రం తన కాళ్లకు కూడా తాడు కట్టుకుని నదిలో దిగి నీటిపై తేలియాడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఇది చూసిన అందరూ దేవుడి మహత్యమే ఈ లీల అని చర్చించుకుంటున్నారు.ఆరేళ్ల కిందట బసవపాలెం గ్రామంలో ఓ శివాలయాన్ని శివయ్య దాతల సాయంతో నిర్మించాడు.ఈ శివాలయంలో శివయ్య నిత్యం పూజలు, అర్చనలు చేస్తూ కాలం వెళ్ల దీస్తుంటాడు.తనకు చదువు రాకపోయినా కానీ అష్టోత్తరాలు చదువుతూ ఉండడం చూసి శివయ్యకు ఏవో శక్తులు ఉన్నాయని గ్రామస్తులు నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube