ఎక్కువ మంది ప్రజల ప్రధాన ఆహారం బియ్యం అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు ఈ బియ్యాన్నే తమ ఆహారంగా తింటూ ఉంటారు కాబట్టి.
బియ్యంలో కూడా చాలా రకాల బియ్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి.వాటిలో ప్రధానమైనవి వైట్ రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్.
కానీ ఎక్కువమంది ప్రజలు మాత్రం ఈ తెల్ల బియ్యాన్నే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు.కానీ రెడ్ రైస్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది.
ఈ రెడ్ రైస్ లో ఆంథోసయనిన్ అనే యాంటీఆక్సిడెంట్ కాంపౌండ్ పుష్కలంగా ఉండటం వల్లనే ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటాయన్నమాట.ఈ రెడ్ రైస్ తింటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని నిపుణులు అంటున్నారు.
మరి ఈ రెడ్ రైస్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందామా.
తమిళనాడులో ఈ ఎర్రబియ్యాన్ని మాప్పిళ్లై సాంబ అని పిలుస్తారు.
మాప్పిళ్లై అంటే అల్లుడు అనే అర్థం వస్తుందట.ఈ రెడ్ రైస్ లో పోషకాలు ఎక్కువగా ఉండడం వలన ఈ బియ్యాన్ని అల్లుడికోసం ప్రత్యేకంగా తమిళనాడు ప్రజలు వండి పెడతారట.
ఈ రెడ్ రైస్ లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ తో పాటు ఇనుము కూడా అధికంగా ఉంటుంది.అలాగే ఈ బియ్యంలో పోషక విలువలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి.
మరి ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి రెడ్ రైస్ చాలా మంచిది.ఎందుకంటే ఈ రైస్ అన్నం చాలా నిదానంగా జీర్ణమవుతుంది.
దీంతో ఎవరికయినా సరే త్వరగా ఆకలి వేయదు.ఈ రెడ్ రైస్ లో విటమిన్ బి1, బి2 వంటి విటమిన్లతోపాటు ఐరన్, జింక్, పొటాషియం, సోడియం, కాల్షియం, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

అలాగే రెడ్ రైస్ వలన రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.ఈ ఎర్రబియ్యంను ఎక్కువగా షుగర్ పేషేంట్స్, గుండె వ్యాధి ఉన్నవారు తింటే చాలా మంచిది.ఈ బియ్యంలోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.ఎర్రబియ్యంలో ఉండే మాంగనీస్ యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేయడం వలన శరీరంలోని ఫ్రీ రాడికల్స్నూ తగ్గిస్తుంది.వీటిని క్రమం తప్పకుండా తింటే ఆస్తమా సమస్యను నివారిస్తుంది.బరువు తగ్గాలని భావించే వారికి రెడ్ రైస్ బెస్ట్ అప్షన్ అని చెప్పాలి.
కాగా ఈ రెడ్ రైస్ ను మిగిలిన బియ్యం మాదిరిగా వండకూడదు.ఈ రెడ్ రైస్ లో ఒకటికి మూడు కప్పుల చొప్పున నీళ్లు పోసి రెండు మూడు గంటలు నానబెట్టి, చిన్న మంట మీద మెత్తగా ఉడికించి తినాలి.
ఇకపోతే ఈ రైస్ ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.